చరిత్రలో ఈరోజు : హిస్టరీలో నేడు ఏం జరిగిందో తెలుసా..?

praveen

ఫిబ్రవరి 3వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరీ ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 తమ్మర గణపతిశాస్త్రి జననం : నిజాం విమోచనోద్యమం కారుడైన తమ్మారు  గణపతిశాస్త్రి 1923 ఫిబ్రవరి 3వ తేదీన జన్మించారు.ఈయన  నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లు పోరాటం చేశారు.

 

 ద్యుతి చంద్  జననం  : ప్రముఖ భారతదేశ పరుగుపందెం క్రీడాకారిణి అయిన ద్యుతి చంద్  1994 ఫిబ్రవరి  3వ తేదీన జన్మించారు. ఒరిస్సా లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఒలంపిక్ క్రీడల వరకు వెళ్ళింది. ఓ నిరుపేద చేనేత కుటుంబంలో ద్యుతి చంద్  జన్మించింది. అయితే ద్యుతి చంద్  తల్లిదండ్రులకు మొత్తంగా 7 గురు పిల్లలు. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో వారిని ఎలా పోషించాలో  తెలియదు. చిన్న మట్టి గుడిసెలో నివాసం ఉండేవారు. అక్కడ కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా ఉండేది కాదు. అయితే ద్యుతీ చంద్ అక్కకి పరుగు పందాలు అంటే ఎంతో ఇష్టం. అయితే తనతో పరుగు పందాలు కోసం ఎవరూ తోడు లేరు  అనుకుని ద్యుతిని  తోడు తీసుకెళ్లేది. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో  ఇసుకలో మట్టి రోడ్లపై పరుగులు తీసేవారు. 

 

 

 ద్యుతి కి ఏడేళ్ల వచ్చాక  తల్లిదండ్రులు పరుగు పందాలు ఆపి  చేనేత పని నేర్చుకోవాలంటూ  మందలించారు . అయినప్పటికీ ద్యుతి  అక్క తల్లిదండ్రులకు సముదాయించి ద్యుతి  చంద్ పరుగులో రాటుదేలేల  శిక్షణ ఇచ్చింది. ఇలా అంచలంచలుగా ఎదిగిన జ్యోతి చందు పదహారేళ్ళ వయసులోనే అండర్ 18 విభాగంలో జాతీయ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లలో ఆసియా జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో  100 మీటర్లు 200 మీటర్ల విభాగాల్లోనూ గెలిచింది . ఇక ఆ తర్వాత కామన్వెల్త్ క్రీడలు ఓలింపిక్స్ ఇలాంటి పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 

 

 

 కానీ ఇంతలో అనుకోని ఉపద్రవం ద్యుతి చంద్  జీవితంలోకి వచ్చింది. ఆమె శరీరంలో పురుష హార్మోన్లు స్థాయికి మించి ఉన్నాయని భారత అథ్లెట్ సమైక్య ఈమె పై నిషేధం విధించింది. కాగా నిషేధంపై రెండేళ్లు పోరాడిన ద్యుతి  తర్వాత 2016లో స్విజర్లాండ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది. అయితే కెరీర్ లో ఎన్నో కష్టాలు అధిగమించి విజయాన్ని సాధించిన ద్యుతి చంద్ .. రియో ఒలంపిక్స్లో మాత్రం ఓటమి చవిచూసింది. 100 మీటర్ల పరుగులో నిరాశాజనకంగా 7వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. అయితే జాతీయ స్థాయిలో అత్యుత్తమ రికార్డైన 11:24 ద్యుతికి  చెందినది కావడం గమనార్హం. 1980లో పి.టి.ఉష తర్వాత 36 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ కు అర్హత  సాధించిన తొలి మహిళ క్రీడాకారిణి ద్యుతి  చంద్ . అయితే ఒలంపిక్స్ లో తాను నిరాశపరిచానని  2020లో ఒలంపిక్ లో మాత్రం మరింత అద్భుత  ప్రదర్శన చేసి భారత్ కు స్వర్ణము  తీసుకోస్తా అని  ఆశాభావం వ్యక్తం చేసింది.

 

 

 కె చక్రవర్తి మరణం : ప్రఖ్యాత సంగీత దర్శకుడైన కె.చక్రవర్తి 2002 3వ తేదీన మరణించారు. ఈయన దాదాపు తొమ్మిది వందల అరవై చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఇక ఎన్నో సినిమాల్లో అయినా అందించిన సంగీతం అద్భుతంగా ప్రేక్షకులను అలరించింది. ఇక ఈయన సంగీతానికి గాను అవార్డులు రివార్డులను సైతం అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: