చెవి స‌మ‌స్య‌ల‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..

Kavya Nekkanti
స‌హ‌జంగా కంటి త‌ర్వాత ప్ర‌ధాన‌మైన‌ది చెవి. పుట్టుక‌తోనే చెవిటివారు, మూగ‌వారుగా కూడా ఉంటారు. దీనికి కార‌ణం వారు చెవిటివారు అవ‌డం వ‌ల్ల మాట‌ల్ని నేర్చుకోలేక‌పోవ‌డం వ‌ల్ల తొంద‌ర‌గా ప‌ల‌క‌లేరు. కొంద‌రికి చెవుల‌లో గుబిలి బాగా ఎండ‌వ‌పోయి, అది గ‌ట్టిప‌డిపోయి చెవి నొప్పి వ‌స్తుంది. మ‌రికొంద‌రికి ఏదో కార‌ణం వ‌ల్ల చెవిపోటు వ‌స్తుంది. ఏమైనాగాని చెవిపోటు హ‌ఠాత్తుగా ప్రారంభ‌వుతుంది. 


ఈ చెవిపోటు వ‌ల్ల త‌ల‌నొప్పి, చిరాకు వ‌స్తుంది. కొంత మందికి చెవిలో చీము కారుతుంది. ఈ స‌మ‌యంలో వారికి చెవిపోటు అనిపించ‌వు. కానీ మ‌రికొన్ని స‌మ‌యాల్లో విప‌రీత‌మైన చెవిపోటు వ‌స్తుంద‌. ముఖ్యంగా నీరు చెవిలో పోనివ్వకూడదు. దూదిపెట్టి స్నానం చేయించాలి. ఇలాంటి చెవి స‌మ‌స్య‌ల‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయొచ్చు.. అవేంటో ఓ సారి లుక్కేయండి..


- ఆవ‌నూనె పావు క‌ప్పులో తుమ్మ‌పూలు పాలికి వేసి కాచి,  వ‌డ‌బోసి ఆ నూనెను నొప్పిగా ఉన్నా, చీము కారుతున్నా చెవిలో నాలుగు చుక్క‌లు వేస్తే నొప్పి, చీము కార‌టం త‌గ్గ‌పోతుంది.


- ప‌సుపు ఒక స్పూన్‌, నాలుగు స్పూన్‌ల ప‌టిక‌, ఒక చిన్న‌గ్లాసు నీరు క‌లిపి బాగా క‌ల‌పాలి. వ‌డ‌గ‌ట్టి ఈ ద్రావ‌ణాన్ని అప్పుడ‌ప్పుడు చీము కారే చెవిలో వేస్తే చీము కార‌డం త‌గ్గిపోతుంది.


- రుద్ర‌జ‌డ ఆకు ర‌సాన్ని చెవుల్లో రోజూ రెండు పుటాలా నాలుగు చుక్క‌లు వేస్తే చెవుడు ప్రారంభ ద‌శ‌లో ఉంటే త‌గ్గిపోతుంది. 


- కాకి దొండ చెట్టును స‌మూలంగా వేళ్ల‌తో తీసుకుని వ‌చ్చి, బాగా దంచి కొబ్బ‌రి నూనెల‌లో క‌లిపి మ‌రిగించాలి. ఆ త‌ర్వాత చ‌ల్లారిన నూనెను వ‌డ‌గ‌ట్టి చెవిలో రెండేసి చుక్క‌లు వేసుకుంటే చెవి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.


- వ‌డిపోయిన జిల్లేడు ఆకుల్ని వేడిచేసి, రసం పిండి కొన్ని చుక్క‌ల్ని చీముకారుతున్న చెవిలో వేసుకుంటే తొంద‌ర‌గా త‌గ్గిపోవ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.


- ముల్లంగి దుంప‌ల ర‌సం, జిల్లేడాకుల ర‌సం, ఆవ‌నూనె వీటిన్న‌టినీ స‌మానాంగా క‌లిపి నూనె మాత్రం మిగిలేట‌ట్లుగా కాచి, చ‌ల్లార్చి రెండు, మూడు చుక్క‌లు చెవిలో వేసుకుంటే చెవి పోటు కాని అనేక స‌మ‌స్య‌లు ఉన్నా త‌గ్గిపోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: