బరువు తగ్గించే సురక్షిత డిటాక్స్ లు ఇవే....!

Krishna Kamal
డిటాక్స్ ఆహారాలు ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ రోజుల్లో, పలువురు ప్రముఖులు కూడా ఈ ఆహారం ప్రణాళికను వాడమని సలహా ఇస్తున్నారు. ఇవి బరువు తగ్గించటంతో పాటూ, శరీరాన్ని శుభ్రపరుస్తాయి. ఈ ఆహార ప్రణాళిక పాటించటం సులభం కానీ, సురక్షితమైన ఆహార ప్రణాళిక పాటించేపుడు ఏవి చేయాలో? ఏవి చేయకుడదో కూడా తెలిసి ఉండాలి.

పండ్లు తినండి:


తగిన మోతాదులో పండ్లు తినాలి. శరీరాన్ని శుభ్రపరచటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి; అదేవిధంగా కోలన్ మరియు లిమ్ఫాతేటిక్ వ్యవస్థలను కూడా శుభ్రపరుస్తాయి. మీరు శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తుంటే, తగిన మోతాదులో పండ్లను ఖాళీ కడుపుతో తినాలి..

సాలడ్ తో భోజనాన్ని ప్రారంభించండి:

మీ భోజన సమయంలో ఆకుపచ్చ రంగుతో నిండిన సలాడ్ లను ఉంచుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండే ఇవి అధిక మొత్తంలో ఎంజైమ్ లను కలిగి ఉండి, ఆహరం జీర్ణం అవటానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఇవి విటమిన్, మినరల్, క్లోరోఫిల్ మరియు అనేక ఫైటో రసాయనాలను కలిగి ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: