ఒత్తిడిని దూరం చేసే ఆహారపదార్థాలు ఇవే

Bhavannarayana Nch

ఫాస్టెస్ట్ జీవితం..అంతకంటే ఫాస్టెస్ట్ మనుషులు..రోజువారి టెన్షన్లు..ఉద్యోగరీత్యా ఉండే తల నెప్పులు..టార్గెట్స్..బాసుల తిట్లు..కాళ్ళు అరిగేలా నడవడం... రోడ్డు మీద కాలుష్యం.వర్క్ టెన్షన్లు..అయ్యబాబోయ్ అనేలా కమిట్మెంట్లు..ఇలా ఒకటా రెండా..ఇలాంటి వ్యాపకాలతో మనిషి డబ్బు ఎంత సంపాదిస్తాడో.. తెలియదు కానీ జబ్బులు మాత్రం తప్పకుండ సంపాదిస్తాడు.ఈ జబ్బులు రావడానికి ప్రధానమైన కారణం మాత్రం ముందుగా ఒత్తిడి. మనిషి అన్నీ జయించగలడు కానీ ఒత్తిడిని మాత్రం జయించలేదు..కాబట్టి ఒత్తిడిని జయించగల పద్దతులు ఫాలో అయితే సగం జీవితం హాయిగా గడిపేయచ్చు.

 

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పోషక ఆహార పదార్ధాలు.. నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రకృతి సిద్దంగా పండే పండ్లు కూరలు ఆహారంగా తీసుకుంటే..శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం.

 

ఆహారపు అలవాట్లను వయస్సుకి తగ్గట్టుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి..స్త్రీలు ముఖ్యంగా ఈ నియమాన్ని పాటించాలి.ఎందుకంటే పురుషులు కంటే కూడా స్త్రీలే ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బొప్పాయి తినడంవలన దానిలో ఉండే కెరోటిన్ మనసు తేలిక పడేలా చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.   


 

అప్పుడప్పుడు చాక్లెట్స్ తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. దీనిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తగ్గించి సహజసిద్దమైన యాంటీ–డిప్రెషన్‌గా పనిచేస్తుంది. గోధుమలలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరా చేసిఒత్తిడిని నివారిస్తుంది.పాలలోని ల్యాక్టోజ్ వల్ల నిద్రలేమి సమస్యను తగ్గించి, మెదడును చురుకుగా ఉంచుతుంది.

 

అయితే కమలాఫలం లో కూడా ఈ ఒత్తిడి తగ్గించే గుణం ఉంటుంది అని అంటున్నారు వైద్యులు.కమలా ఫలంలో దొరికే విటమిన్ “సి” కూడా హార్మోన్ల ప్రభావాన్ని నియంత్రిస్తుంది. అరటిపండులో ఉండే క్యాలరీలు, మెగ్నీషియం ఒత్తిడిని సులభంగా తగ్గిస్తాయి. అంతేకాదు జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయడానికి అరటి పండు ఎంతో ఉపయోగ పడుతుంది




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: