మేక పాలు తాగడం వల్ల.. బోలెడు లాభాలు..!
ఆవు పాల కంటే ఎక్కువగా మేక పాలలో ప్రోటీన్స్ విటమిన్లు తక్కువ లాక్టోస్ వంటివి ఉంటాయి. దీంతో మేకపాలు జీర్ణం అవ్వడానికి కూడా సులువుగా ఉంటుందట.. మేక పాలలో ఉండే బయో ఆర్గానిక్ సోడియం మన శరీరానికి చాలా మేలు చేస్తుందట. ఇందులో ఉండేటువంటి పోషకాలు కణాల అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయట. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రతిరోజు మేక పాలు తాగడం వల్ల రక్తపోటుని కూడా నియంత్రించవచ్చట.
ఎవరైనా డెంగ్యూ జ్వరం బారిన పడ్డ వారిలో రక్త ప్లేట్లు చాలా తక్కువగా ఉంటాయి.. అలాంటి వారికి మేక పాలు ఇస్తే తగిన ఫలితం లభిస్తుందట.. ఇది ఒక పోషకమైన ఎంపిక అంటూ కేవలం నిపుణులు తెలియజేస్తున్నారు.. శరీరానికి అవసరమైన పోషకాలను సైతం అందించగలరని నిపుణులు తెలియజేస్తున్నారు.. ఇది రక్త ప్లేట్లను సైతం పెంచడానికి అలాగే డెంగ్యూ వైరస్ పైన ప్రభావాన్ని చూపించడానికి చాలా సహాయపడుతుందట.. అందుకే మేక పాలు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.. అయితే ఇది దొరకడం చాలా కష్టము..