గ్యాస్ సమస్య ఉందా.. ఇలా నిద్రిస్తే ఉపశమనం ఉంటుందట?
అయితే నేటి రోజుల్లో పౌష్టికాహారం తినడం కంటే మసాలాలు దట్టించిన ఆహారం తినడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరిస్తున్నారు జనాలు. అదే సమయంలో ఇక సమయం సందర్భం లేకుండానే కడుపు నింపుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉండి నేటి జనాలు ఎక్కువగా బాధపడుతున్న సమస్యల్లో గ్యాస్ సమస్య కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు పదిమందిలోకి వెళ్లి ఏదైనా ఆహారం తీసుకోవాలన్న కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు గుండెలో మంటగా అనిపించడం కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు.
అయితే ఇలా గ్యాస్ సమస్య ఉన్నవారు పడుకునే దశను మార్చుకుంటే కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంటుందట. ఒకవేళ గ్యాస్ సమస్య వచ్చి గుండెల్లో మంటగా అనిపిస్తే ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో గ్యాస్ ప్రాబ్లం వల్ల ఛాతిలో మంట వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే అప్పుడు ఆసరాగా దిండ్లు పెట్టుకొని పడుకుంటే మంట తీవ్రత తగ్గే ఛాన్స్ ఉంటుందట. ఛాతిలో మంట రావడానికి గ్యాస్ట్రో ఒసో ఫాగియల్ రిప్లక్స్ అంటారట. అయితే రాత్రంతా ఒకే వైపు పడుకోవలసిన అవసరం లేదని మరి కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు.