కోడిగుడ్డు ఎంతసేపు ఉడక బెట్టాలి.. ఇది తప్పక తెలుసుకోండి?
అయితే చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక గుడ్డును తీసుకోవడం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను తొలగించవచ్చు అని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయని.. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుడ్లు తప్పకుండా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతూ ఉంటారు నిపుణులు. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుంది అని అంటూ ఉంటారు. కాగా ఎంతోమంది ఇలా కోడిగుడ్డు తింటూ ఉంటారు. కానీ ఆ కోడి గుడ్డును ఎంతసేపు ఉడకబెడితే మంచిది విషయంపై మాత్రం పెద్దగా అవగాహనతో ఉండరు.
దీంతో కొంతమంది తక్కువ సమయం మాత్రమే కోడిగుడ్లను ఉడకబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. కోడి గుడ్డును రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టి తినడం వల్ల ప్రయోజనం ఉండదు అంటూ చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ రోగులు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినొచ్చట. అయితే కోడిగుడ్లు 12 నుంచి 15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికించాలి. అలా ఉడకబెట్టిన తర్వాతే గుడ్లు తింటే మంచిది అని చెబుతున్నారు. తక్కువసేపు ఉడకపెడితే అటు గుడ్డులో ఉండే పచ్చ తెల్ల సొనా బాయిల్ అవ్వదు అంటున్నారు నిపుణులు.