ఈ ఆకు తింటే చాలు.. శరీరంలో తిప్పలన్నీ పరార్..!

Divya
మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతాలలోనే మనకు చాలా ఔషధ మొక్కలు ఉన్నప్పటికీ కూడా వాటి గురించి పెద్దగా చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి మొక్కలలో తిప్పతీగ మొక్క కూడా ఒకటి.. తిప్పతీగ మొక్కను ఆయుర్వేదంలో కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.. ఈ మొక్క యొక్క జ్యూస్ ,పౌడర్ గా ఉపయోగిస్తూ ఉంటారు.దీనిని ఎలా తీసుకున్న సరే మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ ఆకుల నుంచి కాండం వేర్లు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఈ తిప్పతీగను ఎలా తీసుకున్న ఒంట్లో ఉండే తిప్పలన్నీ కూడా మటుమాయం చేస్తుందట.

తిప్పతీగలో ఉండేటువంటి యాంటి ఇంప్లమెంటరీ గుణాలు సైతం.. జలుబు దగ్గు వంటి వాటిని వెంటనే ఉపశమనం అందిస్తుంది. ఎవరైనా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే తిప్పతీగ ఆకును తినడం మంచిది.

తిప్పతీగ ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుందట. అలాగే మధుమేహం చర్మవ్యాధులకు సంబంధించి కీళ్ల వ్యాధులు జ్వరం దగ్గు మొదలైన వాటి నుంచి కూడా ఈ తిప్పతీగ ఆకురసం ఉపశమనాన్ని కలిగిస్తుంది.

తిప్పతీగ వేర్లను కాస్త ఎండబెట్టిన తర్వాత వాటిని పొడిగా చేసుకుని త్రిఫల చూర్ణం కలుపుకొని తేనెతో తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందట. మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు తిప్పతీగ ఆకుతో పాటు కాస్త బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఆ సమస్య నుండి బయటపడవచ్చు.

మనం తాగేటువంటి నీటిలో తిప్పతీగ రసాన్ని కనీసం రోజులు రెండుసార్లు అయినా తాగితే చర్మవ్యాధుల నుంచి బయటపడడమే కాకుండా శ్వాసకోశ సమస్యలను ఉబ్బసం వంటి వాటి నుంచి బయటపడవచ్చు.

తిప్పతీగ జ్యూస్ లో ఎక్కువగా గ్లూకోస్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడుతుంది. తిప్పతీగ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఎలాంటి వ్యాధులను కూడా దరికి చేరనివ్వదు..

ఎవరైనా కీళ్లనొప్పి కడుపులో మంట ఉన్నవారు తిప్పతీగ వేర్లతో ధూపంకానీ రసం కాని చేసుకోవడం వల్ల చాలా లాభాలు కలిగి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: