అల్లం ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఎందుకంటే అల్లం నీటిలో విటమిన్ సి, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో సీజనల్ దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ నీళ్లను తాగితే శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అల్లం నీళ్లను తాగితే శరీరంలో రక్తసరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. అల్లం నీళ్లను మహిళలు నెలసరి సమయంలో తాగితే ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతోపాటు అధిక రక్తస్రావం కాకుండా చూసుకోవచ్చు. ఇలా భోజనం చేసిన అల్లం నీళ్లను తాగడం వల్ల మనం చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు.అల్లం నీళ్లను తాగడం వల్ల గుండెల్లో మంట కూడా తగ్గుతుంది. కొంతమందికి తిన్న వెంటనే గ్యాస్ పైకి వస్తుంది. అలాంటి వారు కూడా అల్లం నీళ్లను తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది.
అందువల్ల అధిక బరువు తగ్గుతారు. ఇలా అధిక బరువు తగ్గేందుకు అల్లం నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా అలాగే అల్లంలో ఉండే జింజరాల్, షోగుల్ అనే సమ్మేళనాలు పలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయ పడతాయి. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం అనేవి ఉండవు. అలాగే భోజనం అనంతరం పొట్టలో ఉండే అసౌకర్యం కూడా తొలగిపోతుంది. ఇక కొందరు ఎల్లప్పుడూ వికారంగా ఉందని అంటుంటారు. అలాంటి వారు కూడా భోజనం చేసిన తరువాత అల్లం నీళ్లను తాగాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వికారం తగ్గుతుంది.అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది. దీంట్లో ఇమ్యూనిటీని పెంచే గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల అల్లం నీళ్లను తాగితే మనం ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చు. అల్లం నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. వికారం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది