వామ్మో ఇవి తినేటప్పుడు జాగ్రత్త.. లేదంటే ప్రమాదమే?

Purushottham Vinay

వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. డయేరియా, ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే.. ఏం తిన్నా కానీ కాస్త చూసుకొని, జాగ్రత్తగా వాటిని తినాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలా కూరగాయల్లో పురుగులు, బ్యాక్టీరియా అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటి కారణంగానే.. వర్షా కాలంలో ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. మరి, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఏ కూరగాయలు తినకూడదో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అందరి ఇంట్లో కామన్ గా ఉండే కూరగాయ ఏంటంటే టమాట. మాక్సిమం అన్ని కూరల్లో ఈ టమాట లేదని వంటే పూర్తి కాదు. కానీ.. ఈ సీజన్ లో  మాత్రం టమాటలను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ లో టమాటలు తింటే.. జీర్ణ సమస్యలతో పాటు.. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట.క్యాప్సికమ్స్ లో.. నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే... ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఈ సీజన్ లో ఈ క్యాప్సికమ్  కి దూరంగా ఉండటమే మంచిది.క్యాలీ ఫ్లవర్ కూడా..వర్షకాలంలో తినే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే...  ఈసీజన్ లో క్యాలిఫ్లవర్ తేమను ఎక్కువగా పీల్చుకుంటాయి.  


దాని వల్ల.. పురుగులు దీనిలో  ఎక్కువగా నిల్వ ఉంటాయి. చూసుకోకుండా.. దీనిని తినేస్తే.. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కాస్త చూసుకొని, జాగ్రత్తగా తినాలి.వర్షాకాలంలో క్యాబేజీ తినకుండా ఉండటమే మంచిది. ఈ సీజన్ లో క్యాబేజీ లో చాలా మాయిశ్చరైజేషన్ ఉంటుంది. దీనిని సరిగా స్టోర్ చేయకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయట. అందుకే.. క్యాబేజీని సరిగా స్టోర్ చేసుకోవాలి. వండే ముందు సరిగా వాష్ కూడా చేయాలి.నిజానికి వర్షాకాలంలో ఆకుకూరలు చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా పెరుగుతాయి కూడా. కానీ.. ఈ కాలంలోనే ఆకుకూరలు తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు.  ఎందుకంటే... ఈ సీజన్ లో ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. మన కంటికి కనిపించే పురుగులు మాత్రమే కాదు.. కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అందుకే.. వీటిని తినే సమయంలో చాలా  జాగ్రత్తగా ఉండాలి. అలా అని వీటిని పూర్తిగా తినకూడదు అని కాదు.. తినే సమయంలో.. వీటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మాత్రం అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: