స్ట్రచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..!

Divya
చాలా మందికి  కొన్నిసార్లు అనుకోకుండా స్ట్రచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి.. మరి కొంత మందికి బరువు తగ్గిన లేకపోతే పెరిగినా కూడా ఈ స్ట్రెస్ మార్కులు ఎక్కువగా చంకలో, తొడలు, పొత్తికడుపు వంటి భాగాలలో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మహిళలు డెలివరీ అయ్యాక ఎక్కువగా ఇలాంటి స్ట్రెచ్ మార్కులు కనిపిస్తాయి. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది క్రీమ్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి తగ్గినప్పటికీ కూడా సైడ్ ఎఫెక్టు అనేది చాలా చూపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక హోం రెడిమిస్ ఉపయోగించి వీటిని మనం తగ్గించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవట. మరి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు చర్మం పైన రాస్తే స్ట్రెచ్ మార్క్స్ తో పాటు మచ్చలు, డార్క్ స్పాట్లు కూడా తగ్గిపోతాయి. ఆలివ్ ఆయిల్ని కాస్త గోరువెచ్చగా చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉండే చోట రాసి వదిలేసిన తర్వాత కొద్దిసేపటికి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంపలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి ఇది చర్మం పైన ఉండే నలుపును సైతం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బంగాళాదుంప రసం వల్ల స్ట్రెచ్ మార్కు ఉన్నచోట రాస్తే ఇవి తగ్గుతాయి.

కోడిగుడ్లలో ఉండేటువంటి ప్రోటీన్ అధికంగా ఉంటుంది.. గుడ్డులో ఉండే తెల్ల సమస్యలు కొల్లాజెన్ అనే ఉత్పత్తిని పెంచుతుందట.. ఇది మన చర్మం మీద ఉండే ముడతలు స్ట్రెచ్ మార్కుని సైతం పోగొట్టేలా చేస్తుంది.

కొబ్బరి నూనె కూడా స్ట్రెచ్  మార్కుకి బాగా ఉపయోగపడుతుంది.. కొబ్బరినూనె కాస్త గోరు వెచ్చగా చేసిన తర్వాత స్ట్రెచ్ మార్స్  ఉండే చోట రాస్తే.. ఇవి తగ్గిపోతాయి.. అయితే క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు ఇలా చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: