స్ట్రచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..!
ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు చర్మం పైన రాస్తే స్ట్రెచ్ మార్క్స్ తో పాటు మచ్చలు, డార్క్ స్పాట్లు కూడా తగ్గిపోతాయి. ఆలివ్ ఆయిల్ని కాస్త గోరువెచ్చగా చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉండే చోట రాసి వదిలేసిన తర్వాత కొద్దిసేపటికి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బంగాళదుంపలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి ఇది చర్మం పైన ఉండే నలుపును సైతం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బంగాళాదుంప రసం వల్ల స్ట్రెచ్ మార్కు ఉన్నచోట రాస్తే ఇవి తగ్గుతాయి.
కోడిగుడ్లలో ఉండేటువంటి ప్రోటీన్ అధికంగా ఉంటుంది.. గుడ్డులో ఉండే తెల్ల సమస్యలు కొల్లాజెన్ అనే ఉత్పత్తిని పెంచుతుందట.. ఇది మన చర్మం మీద ఉండే ముడతలు స్ట్రెచ్ మార్కుని సైతం పోగొట్టేలా చేస్తుంది.
కొబ్బరి నూనె కూడా స్ట్రెచ్ మార్కుకి బాగా ఉపయోగపడుతుంది.. కొబ్బరినూనె కాస్త గోరు వెచ్చగా చేసిన తర్వాత స్ట్రెచ్ మార్స్ ఉండే చోట రాస్తే.. ఇవి తగ్గిపోతాయి.. అయితే క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు ఇలా చేయాల్సి ఉంటుంది.