ప్రతి రోజు ఇదొక్కటి తింటే చాలు శరీరానికి కావాల్సిన పోషకాలన్ని అందుతాయి ?

Purushottham Vinay

ఉసిరిని తినడం వల్ల అందులో ఉండే విటమిన్ సి మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు అందటానికి,శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉసిరి గాయాలను నయం చేయడంలోను సహాయపడుతుంది. అయితే ఉసిరిని రోజుకు ఒక్కటిగా తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ప్రతీరోజూ తీసుకునే ఆహారంలో ఉసిరిని చేసారుచుకోవడం వల్ల అనేక వ్యాధుల భారీ నుండి దూరం చేసుకోవచ్చు. అయితే తరచూ పరగడుపున ఉసిరిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.ఉసిరిని పోషకాల గని అని పిలుస్తారు. కాబట్టి ఉసిరిలో ఆరోగ్యాన్ని రక్షించేందుకు అనేక రకాల ఔషధగుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల అయినా ప్రాణాంతకర రోగాల భారీ నుండి రక్షించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఉసిరిలో ఉండే పోషకాలు అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.

ఉసిరి పుల్లగా, వగరుగా ఉంటుంది. కానీ దీనిని తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణవ్యవస్థ :ఉసిరిని తరచూ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. కంటి చూపు :ఉసిరిలో ఉండే విటమిన్ సి వల్ల కంటి చూపును, కళ్ళను, కంటి సమస్య లను తగ్గించడంలో మెరుగుపరుస్తుంది. అంతేకాదు కంటి శుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.జుట్టు :ఉసిరిని తీసుకోవడం వల్ల విటమన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా అంది జుట్టును మెరుగుపరుస్తుంది. అంతేకాదు జుట్టును చాలా బలంగా, ధృడంగా తయారుచేస్తుంది.బరువు తగ్గడానికి :బరువు తగ్గడానికి ఉసిరిని తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా అంది బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఇవి శరీరం లో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించి,బరువు తగ్గి సన్నగా నాజుగ్గా కనిపించేలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: