చాలా మందికి కూడా చర్మ సమస్యలు వస్తాయి. అయితే, వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో తేమ కారణంగా ఈ సమస్యలు వస్తాయి. అయితే వేప ఎన్నో రకాల ఔషధ లక్షణాలతో నిండి ఉంటుంది. దీని ఆకులను నీటిలో వేసి మరిగించి ప్రతి రోజూ కనుక స్నానం చేస్తే ఎలాంటి చర్మ సమస్యలు రావు. అలాగే వేప బెరడును తీసుకొని దానిని గ్రైండ్ చేసి, ప్రభావిత ప్రాంతంలో పూయడం వల్ల ఫంగస్ నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఫంగస్ పై వేప ఆకుల పేస్ట్ కూడా అప్లై చేయవచ్చు. ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ని కూడా ఉపయోగించవచ్చు. అథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్ మొదలైనవాటిని తగ్గించడానికి, ఆపిల్ సైడర్ వెనిగర్‌ను చాలా బాగా పనిచేస్తుంది.
దాన్ని నీటిలో కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.ఇంకా అలాగే టీ ట్రీ ఆయిల్ కూడా యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని అందించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రభావిత ప్రాంతంలో దీనిని క్రమం తప్పకుండా అప్లై చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడుతుంటే, ఈ సమయంలో పెరుగు తీసుకోవడం మంచిది. ఇది పెరుగు మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే మీరు సాధారణ పెరుగు మాత్రమే తినాలి.. చక్కెర, ఉప్పు వంటివి అస్సలు జోడించవద్దు. మన వంటగదిలో వెల్లుల్లి చాలా సులభంగా దొరుకుతుంది. మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఈజీగా ఎదుర్కోవటానికి దీనిని ఉపయోగించవచ్చు.ఎందుకంటే ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. వెల్లుల్లిని బాగా చూర్ణం చేసి, ప్రభావితమైన చర్మంపై అప్లై చేస్తే ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది.