వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలి.. WHO కీలక సూచన?

praveen
నేటి ఆధునిక సమాజంలో మనిషి చాలా బిజీ అయిపోయాడు. ఎంతలా అంటే ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా.. మనీ వెంట పరుగులు పెట్టేంత బిజీ అయిపోయాడు మనిషి. ఇక మనీతోనే మనకు రెస్పెక్ట్ వస్తుంది అని నమ్ముతున్న మనిషి ఇక మని సంపాదించడం కోసం పడుతున్న పాట్లు అన్నీ కావు. ఈ క్రమంలోనే ఉరుకుల పరుగుల జీవితంలో అటు ఆరోగ్యం గురించి పట్టించుకునేందుకు మనిషికి టైమే లేకుండా పోయింది. దానికి తోడు ఇక మారిపోతున్న మనిషి జీవనశైలి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది అన్న విషయం తెలిసిందే.

 సాధారణంగా ప్రతిరోజు వ్యాయామం చేస్తే శారీరక దృఢత్వం రావడమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇలా ప్రతిరోజు వ్యాయామం చేసే సమయం మాత్రం ఎవ్వరికి లేదు. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి అయ్యో వ్యాయామం చేసి ఉంటే బాగుండేది ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నేటి బిజీ ప్రపంచంలో కనీసం వారానికి ఎన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచిది అన్న విషయం ఎవరికీ కూడా తెలియదు. కాగా ఈ విషయం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కీలక సూచన చేసింది.

 వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. 300 నిమిషాల వరకు ఎక్సర్సైజులకు కేటాయించాలి అంటూ తెలిపింది. ఐదేళ్ల వయసు మొదలు అన్ని రకాల వయస్సులవారికి కూడా పలు సిఫారసులను చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తగినంత వ్యాయామం చేయని వారిలో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని స్పష్టం చేసింది. మరి ముఖ్యంగా షుగర్ బిపి గుండె సంబంధిత సమస్యలు ఇలా వ్యాయామం చేయని వారిలో ఎక్కువగా వస్తున్నాయ్ అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: