తల్లీ రక్తంతోనే పుట్టినా.. బిడ్డ బ్లడ్ గ్రూప్ ఎందుకు తేడా ఉంటుందో తెలుసా?

praveen
మాతృత్వపు అనుభూతి అనేది ప్రతి మహిళకు ఎంతో ప్రత్యేకమైన విషయం తెలిసిందే. ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి కూడా ఇలా అమ్మతనాన్ని పొందాలని అనుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారి గర్భం దాల్చిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది మహిళ. తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారం టైం కి మందులు వేసుకోవడం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో తన బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం చేస్తూ ఉంటుంది. ఇలా పుట్టబోయే బిడ్డ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది తల్లి.

 అయితే తల్లి రక్తంతోనే పుట్టే కడుపులో శిశువు ఎదుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ బిడ్డ పుట్టాక మాత్రం తల్లికి బిడ్డకి మధ్య చాలా తేడాలు ఉంటాయి. తన తల్లి పోలికలతో పుట్టకపోవడం.. కనీసం బ్లడ్ గ్రూప్ కూడా తల్లి బిడ్డకు మ్యాచ్ కాకపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా కడుపులో తల్లి రక్తంతోనే పెరిగిన శిశువుకు ఎందుకు ఇలా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వదు అన్న విషయం ఎవరు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు.

 అయితే మహిళ గర్భంలో శిశువు ఉన్నప్పుడు చాలా మంది పిండం రక్తం తల్లి రక్తం కలుస్తుంది అనుకుంటారు. కానీ వీరి బ్లడ్ ఎక్కడ కలవదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే గర్భధారణ సమయంలో తల్లి పిండం వేర్వేరు రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయట. పిండానికి అవసరమయ్యే ఆక్సిజన్ పోషకాలు తల్లి రక్త ప్రవాహం నుంచి మాయ ద్వారా పిండానికి వెళ్తాయట. అంటే రక్త కణాలు విడివిడిగా ఉంటాయి. పదార్థాల మార్పిడి ప్లాసెంటల్ సర్కులేషన్ అనే ప్రక్రియ కూడా జరుగుతుందట. ఇక పిల్లల రక్త నమోనం అనేది తల్లిదండ్రులు ఇద్దరి నుంచి సంక్రమించిన జన్యు సమాచారం ద్వారా నిర్ణయించబడుతుందని నిపుణులు  అంటున్నారు  పిల్లల రక్తనమున వర్గాన్ని నిర్ణయించడానికి తండ్రి జన్యు సమాచారం.. తల్లి జన్య సమాచారంతో కలిపి గర్భధారణ సమయంలో పిల్లల రక్త నమూనా ఏర్పడుతుందట. అంతేకాకుండా కాకుండా తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్స్ వేర్వేరుగా ఉంటే భిన్నంగా పుట్టే బిడ్డ బ్లడ్ గ్రూప్ ఉంటుందట. ఉదాహరణకు తల్లి ఏ బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ అయితే పుట్టబోయే ab లేదా ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: