పేరుకే అవిసె గింజలు.. ఉపయోగాలెన్నో..!
ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి వాటర్ తో రెండుసార్లు శుభ్రం చేయాలి.. ఆపై గ్లాస్ నిండా వాటర్ పోసుకొని.. మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టుకున్న అవిసె గింజలను నీటితో సహా తీసుకోవాలి. ఇక అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. ఆకలి కోరికను అణిచివేస్తాయి.. అవిసె గింజలు తినడం వల్ల అధిక బరువు ఊబకాయం వంటి సమస్య ఉన్నవారు త్వరగా బరువు తగ్గవచ్చు . మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాని పాటిస్తే చాలా చక్కని ఉపయోగాలు ఉంటాయి.
ఒక అధిక బరువే కాదు మలబద్ధకం సమస్యతో బాధపడే వారు కూడా అవిసె గింజలను తీసుకోవచ్చు..ఈ గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది.. జీర్ణ వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా డైట్లో వీటిని చేర్చుకుంటే రక్తంలో చక్కెర లెవెల్స్ అదుపులో వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ నీటిలో నానబెట్టడం వల్ల అవి రెట్టింపవుతాయి. రోజు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.. గుండెపోటు వంటి సమస్యలు దూరం అవుతాయి.. అలాగే రక్తపోటు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా దూరం అవుతాయి.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.