అండం, వీర్యం లేకుండానే బిడ్డకు జన్మ.. అదెలా సాధ్యమంటే?
ఏకంగా కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలోనే తెలియకుండానే తల్లికి బిడ్డకి మధ్య ప్రేమానురాగాలు పెరిగిపోతూ ఉంటాయి. ఏకంగా తల్లి యొక్క కష్టాన్ని ఇష్టాన్ని నష్టాన్ని అన్నింటిని కూడా బిడ్డ కడుపులో ఉండే అన్ని తెలుసుకుంటూ ఉంటుంది. అయితే ఒకప్పుడు గర్భం దాల్చడం అంటే కేవలం స్త్రీ పురుషుల శారీరక కలయిక జరిగినప్పుడు మాత్రమే గర్భం దాల్చే అవకాశం ఉండేది. కాని ఇటీవల కాలంలో వైద్య రంగంలో వినూత్నమైన టెక్నాలజీ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక శారీరక కలయిక లేకపోయినప్పటికీ ఏకంగా మహిళ అండంలోకి ఇక పురుషుల వీర్యాన్ని ప్రవేశపెట్టి ఐవిఎఫ్ ద్వారా కూడా గర్భధారణ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
అయితే ఇలా ఎలాంటి పద్ధతిలో అయినా ఒక మహిళ గర్భం దాల్చాలి అంటే తప్పకుండా అండంతో పాటు వీర్యకణాలు కూడా అవసరం. కానీ ఇక్కడ మాత్రం వినూత్నమైన టెక్నాలజీతో అండం వీర్యం గర్భాశయం అవసరం లేకుండానే ఏకంగా బిడ్డకు జన్మనివ్వవచ్చట. దీనిని ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీ అంటారట. ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని యాక్టో లైఫ్ పేర్కొంది. మానవ కణాలు, మానవ మూలకణాలను ప్రయోగశాలలో వృద్ధి చేసిన కణాలను తీసుకొని మానవ పిండాన్ని రూపొందిస్తారట. తర్వాత ఆ పిండాన్ని 9 నెలలు వరకు ఇక బిడ్డ మానవరూపం ధరించి బయటకు వచ్చేవరకు కృత్రిమ గర్భంలోనే ఉంచుతారట. 9 నెలలు ఆ బిడ్డ సంరక్షణను ఆ యంత్రమై చూసుకుంటుందట. ఆ తర్వాత ఎవరైతే బిడ్డను కణాలనుకున్నారో వారికి ఇచ్చేస్తారట. ఇక ఇవన్నీ చూస్తుంటే ఏకంగా మాతృత్వపు అనుభూతి కూడా రానున్న రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందేమో అనే భావన కలుగుతుంది కదా.