కాళీ కడుపుతో తులసి నీళ్లు తీసుకుంటే చాలు సర్వ రోగాలకు చెక్..!!

Divya
సాధారణంగా హిందూ సాంప్రదాయంలో తులసికి చాలా పవిత్రమైన స్థానం ఉంది.మనదేశంలో హిందువులంతా తులసి చెట్టులో తమ ఇంటి ముందు ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు.ఇది సాంప్రదాయం ప్రకారం ఎంత పవిత్రము ఆయుర్వేదంలో కూడా అంతే ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే తులసి ఆకులను రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరీ ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షిస్తాయి.తులసి పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ఎవరైతే తరచూ జలుబు,దగ్గు,జ్వరం అంటూ సీజనల్ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు.అటువంటి వారికి తులసి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆంటీ బ్యాక్టీరియల్ మరియు ఆంటీ ఫంగల్ గుణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచి,దగ్గు జలుబు జ్వరం వంటి రోగాలను దరిచేరకుండా కాపాడుతుంది.

అంతేకాక ఎవరైతే తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారో,అటువంటి వారికి కూడా తలసనీరు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న అధిక ఆయుర్వేద గుణాలు అజీర్తి సమస్యలను
గ్యాస్,మలబద్ధకం వంటి వాటిని దూరం చేస్తాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి,గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.అంతేకాక తులసిలో శరీరంలో మంటను తగ్గించే సమ్మేళనాలు పుష్కళంగా లభిస్తాయి.మరియు ఇందులో ఉన్న ఆరోమా నోటి దుర్వాసనను పోగొడుతుంది.సోర్ గొంతు వంటి ఇన్ఫెక్షన్ ల ను తొందరగా నయం చేస్తుంది.రోజూ ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
అంతేకాక రక్తంలో ఇన్సులిన్ క్రమభద్దికరించి,డయాభేటీస్ రాకుండా ఉపయోగపడుతుంది. ఎవరైతే వంశపారంపరిగా వంశపారంపర్యంగా డయాబెటిస్తో బాధపడుతూ ఉంటారో,అటువంటివారు ముందు నుంచే తులసి ఆకులు నమలడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
 అంతేకాక తులసి ఆకులను చర్మంపై లేపనంగా వేయడం వల్ల దద్దుర్లు,పుండ్లు వంటివి ఈజీగా నయం అవుతాయి.కావున ప్రతి ఒక్కరూ తులసి ఆకుల నీరును పరగడుపున తీసుకోవడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: