వేసవి కాలంలో దొరికే.. తాటి ముంజలు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా..?

Divya
సమ్మర్ సీజన్ ఈసారి కాస్త ముందుగానే వచ్చేలా కనిపిస్తోంది.సూర్యుడు వేడి దాటికి తట్టుకునేందుకు ప్రజలు సైతం ఆరోగ్య పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ సీజన్లో దొరికేటువంటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది.. ముఖ్యంగా పుచ్చకాయ, కర్బుజా కాయలు వంటి తినడం వల్ల నీటి శాతం ఎక్కువగా లభించడమే కాకుండా ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి కంటే మానవ శరీరానికి మేలు చేసేటువంటి తాటి ముంజలు తినడం చాలా మంచిదట.

గ్రామాలలో ఎక్కువగా తాటి ముంజలు దొరుకుతూ ఉంటాయి సిటీలలో కాస్త రేటు ఎక్కువ పెట్టి మరి కొంటూ ఉంటారు.. తాటి ముంజలలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో A విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.. అలాగే జింక్, విటమిన్-B,C , ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం అంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి.
మన శరీరంలో నుండి వ్యర్ధాలను సైతం బయటికి పంపించడానికి ఈ తాటి ముంజలు చాలా సహాయపడతాయి. అలాగే మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు జీర్ణక్రియ శక్తి కూడా పెంచేలా సహాయపడతాయి. శరీరాన్ని సైతం చల్లపరిచే గుణం ఈ తాటి ముంజలలో పుష్కలంగా లభిస్తుంది.
మొటిమలు తగ్గించడం ఎసిడిటీ సమస్యలను నిర్మూలించడం వంటి వాటిలో కూడా తాటి ముంజలు ఉపయోగపడతాయి.ముఖ్యంగా ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు వీటిని తింటే మంచి బలాన్ని కూడా అంది స్తాయి. తాటి ముంజలకు ఉండే పొట్టును తీసి తినడం కంటే పొట్టుతో సహా తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని నిపుణులు సైతం తెలుపుతున్నారు.
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి తాటి ముంజలు తినడం వల్ల అధిక బరువు నుంచి నెమ్మదిగా తగ్గుతారు. కొబ్బరి బొండం లో ఉండేటు వంటి పోషకాలు తాటి ముంజలలో కాస్త ఎక్కువగానే లభిస్తాయి. మరి ఈ వేసవికాలంలో వీటిని తినడం మర్చిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: