ఇట్స్ ఏ మిరాకిల్.. గొరిల్లాకు సిజేరియన్ ఆపరేషన్?
సిజేరియన్ డెలివరీ ద్వారా ఏకంగా ఆపరేషన్ నిర్వహించి కడుపులో ఉన్న బిడ్డను డాక్టర్లు బయటకు తీస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అందరికీ ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పటివరకు ఇలా మనుషులకి సిజేరియన్ డెలివరీ చేస్తారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వైద్యులు మాత్రం ఏకంగా గొరిల్లాకి సిజేరియన్ డెలివరీ చేశారు. మనుషులకు చేసినట్లుగానే గొర్రెలకు సిజేరియన్ డెలివరీ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది.
అమెరికా లోని టెక్సాస్ లో గల జంతు ప్రదర్శనశాల లో 33 ఏళ్ల వయస్సు సెకన్ అనే గొరిల్లాకు ఈ ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఇక ప్రసవానికి నాలుగు వారాల ముందే వైద్యులు సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా ఇక గొరిల్లా కడుపులో ఉన్న బేబీని బయటకు తీశారు. ప్రస్తుతం ఈ బేబీని పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు. కాగా ఈ బేబీ గొరిల్లాకు జమీల అనే నామకరణం చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇలా అరుదైన ఆపరేషన్ నిర్వహించి బేబీ గొరిల్లాను కాపాడిన వైద్యుల పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.