మెడ నలుపు తొందరగా పోగొట్టుకోవాలంటే ఈ చిట్కా పాటిస్తే చాలు..!

Divya
సాధారణంగా చాలామందికి శరీరం,మొఖం అన్ని తెల్లగా ఉన్నప్పటికీ మెడ మాత్రం నల్లగా అందవిహీనంగా ఉంటుంది.దీనికి కారణం అధిక బరువు హార్మోనల్ ఇన్ హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వేసుకున్న నగలు వంటి కారణాల వల్ల కూడా మెడ నలువుగా మారుతూ ఉంటుంది.చాలామంది నలుపుదలాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ కూడా ఉంటారు.కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము కలగక,తెగ ఫీల్ అవుతూ ఉంటారు.అటువంటి వారికి మన ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేసుకునే మిశ్రమం ద్వారా తొందరగా నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు.మరియు తక్కువ ఖర్చు కూడా.ఈ చిట్కాను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు.అదేంటో,అదేలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మరి..
ఈ చిట్కా కోసం కావాల్సిన పదార్థాలు ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్,రెండు స్పూన్ల టమాటా గుజ్జు,స్పూన్ కలబంద గుజ్జు,ఒక స్ఫూన్ శనగపిండి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకుని మిశ్రమాన్ని అద్దుతూ,మెడపై మర్దన చేసినట్టు అప్లై చేసుకోవాలి.ఆ తరువాత ఒక 15 నిమిషాలు మసాజ్ చేసి,అరగంటసేపు ఆరనివ్వాలి.ఇలా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మరియు రోజు పడుకోబోయే ముందు మాయిశ్చరైజర్ కానీ,సీరం అప్లై చేయడం వల్ల చర్మం చర్మం డిహైద్రాట్ కాకుండా కాపాడుతాయి.నిమ్మ, మరియు టమాటాలోని యాసిడ్ గుణాలు చర్మం నలుపుదనం పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
ఈ చిట్కాతో నెల రోజుల లోపు మెడ,ముఖం ఒకే రంగును సంతరించుకుంటాయి.ఇలాంటి సహజ చిట్కాలు వాడే కంటే ముందే శరీర ఆరోగ్యాన్ని పరిశీలించుకొని దానికి తగ్గ ఆహారం,మెడిసన్ వాడటం ఉత్తమం. అధిక బరువు తగ్గించుకోవడానికి సరైన పోషకాహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.మరియు మన చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది.కావున ప్రతి ఒక్కరూ తగినంత నీరు తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: