పొద్దున్నే ఈ టీ తాగితే హెల్త్ కి చాలా మంచిది?

Purushottham Vinay
పొద్దున్నే లేవగానే కప్పు కాఫీ లేదా కప్పు టీ తాగేవారు చాలా మంది వుంటారు. ఇలా రోజును ప్రారంభించే వారి సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ను ఖాళీ పొట్టతో తాగడం వల్ల జరిగే మేలు కన్నా నష్టమే చాలా ఎక్కువ ఉంటుంది.పొట్ట సమస్యలు ఇంకా హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు ఉదయం పూట కెఫీన్ తీసుకోవడం మంచిది కాదు. పొట్టలో మంట, ఎర్రబడడం వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇది పొట్టలోని పలుచని లైనింగ్ను ఇబ్బంది పెడుతుంది. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలను కూడా పెంచుతుంది. ఇంకా అలాగే హార్మోన్ల అసమతుల్యత, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, వేడి చేయడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి కెఫిన్ లేని హెర్బల్ టీని పరగడుపున తాగడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మైగ్రేన్, ఎసిడిటీ, వికారం, తలనొప్పి, హై బీపీ ఇంకా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ హెర్బల్ టీ చాలా బాగా మేలు చేస్తుంది. ఆ సమస్యలను ఈజీగా తగ్గించడానికి సాయపడుతుంది. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ.


స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీరు పోసి మీడియం మంట మీద ఉంచాలి.తరువాత రెండు రెమ్మల కరివేపాకులు, గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసి కలపాలి. ఇక అందులోనే ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు అలా ఉడికించాలి. ఆ తరువాత వడకట్టి ఆ నీటిని గ్లాసులో పోయాలి. అంతే... అద్భుతమైన ఔషధ టీ రెడీ అవుతుంది. దీన్ని పరగడుపున తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే దీనిలో కెఫీన్ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ హెర్బల్ టీలో అర స్పూన్ నెయ్యి లేదా ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకుని తాగితే ఇంకా చాలా మంచిది. ఇది పేగులకు చాలా మేలు చేస్తుంది. గ్రీన్ టీ  తాగడం వల్ల మంచే జరుగుతుంది.ఇందులో చక్కెరను వేసుకోరు కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు. ఈ హెర్బల్ టీలో చాలా తక్కువ కాబట్టి, ఇన్సులిన్  ఒకేసారి ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదు. మితంగా ఇంకా అలాగే నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. టీ, కాఫీల కన్నా ఈ ఔషధ గుణాలు నిండిన టీని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: