బెల్లం ఇలా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు?

Purushottham Vinay
బెల్లం గురించి మనందరికి తెలిసిందే. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడంతో పాటు దీనితో రకరకాల రుచికరమైన తీపి వంటకాలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం.మనం బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెల్లంతో చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే బెల్లాన్ని ఎలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ఇంకా బెల్లాన్ని తీసుకోవడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఏమిటి..పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. పరగడుపున ఒక చిన్న నిమ్మకాయంత బెల్లం ముక్కను తిని ఆ వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. అయితే తెల్ల బెల్లాన్ని అస్సలు ఉపయోగించకూడదు.కేవలం బ్రౌన్ కలర్ లో ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తం బాగా శుద్ది అవుతుంది. మన శరీరంలో మొత్తం 150 కు పైగా అనారోగ్య సమస్యలు రక్తం పాడవడం వల్ల వస్తాయి. అయితే బెల్లం తినడం వల్ల దీనిలో ఉండే ఫాస్పరస్ రక్తాన్ని శుద్ది చేస్తుంది.



దీంతో మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. బెల్లం ముక్కను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు అనేది బాగా పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడి మనం తిన్న ఆహారం కూడా ఈజీగా జీర్ణమవుతుంది. దీంతో మన శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. ఇంకా బెల్లాన్ని తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.బెల్లం తినడం వల్ల మన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బెల్లాన్ని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.ఇంకా అంతేకాకుండా బెల్లాన్ని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య అనేది మన దరి చేరకుండా ఉంటుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. నాడీ మండల వ్యవస్థ చాలా చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా ప్రతి రోజూ ఉదయాన్నే ఒక చిన్న బెల్లం ముక్కను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుందని మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: