ఇక గ్యాస్ సమస్యను కనుక నిర్లక్ష్యం చేస్తే మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను ఏ మాత్రం కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది కూడా గ్యాస్ ను నివారించే మందులను, టానిక్ లను ఇంకా అలాగే పొడులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల సమస్య తగ్గినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఈ టిప్ లని పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా వాడవచ్చు. పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించే ఈ టిప్ లు ఏమిటి.. ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇక గ్యాస్ సమస్యను తగ్గించడంలో మనకు వాము చాలా బాగా ఉపయోగపడుతుంది.గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వాము పొడిని వేసి కలుపుకొని గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా మనం గ్యాస్ సమస్య నుండి చాలా ఈజీగా సులభంగా బయటపడవచ్చు.
ఇంకా అదే విధంగా ధనియాలు కూడా గ్యాస్ సమస్యను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ధనియాలను వేయించి ఆ తరువాత వాటిని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలపాలి. ఈ నీటిని రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ సమస్య అనేది తలెత్తకుండా ఉంటుంది. ఇంకా అలాగే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడే వారు అల్లం కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా వారికి ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక భోజనం చేసిన తరువాత నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించి ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల లేదా భోజనం చేసిన తరువాత అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి నమిలి మింగడం వల్ల కూడా గ్యాస్ సమస్య నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఈవిధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా పొట్టలో గ్యాస్ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.