పొడిపత్రి వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Divya
పొడప‌త్రి మొక్కను భార‌త దేశంలో బాగా పెరుగుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కళంగా ఉంటాయి. ఆయుర్వేద చికిత్సలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.దీని వ‌ల్ల ఎన్నో రకాల రోగాలను సులభంగా న‌యం చేసుకోవ‌చ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం..
కొంతమందికి స్వీట్స్ అన్న, పిండి పదార్థాలు అన్న ఎక్కువగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వారు ఉబకాయానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారికి పొడ‌ప‌త్రి చూర్ణం తీసుకుంటే స్వీట్స్ తినాలనే కోరిక క్రమంగా తగ్గుతుంది. ఆక‌లి అదుపులో ఉంటుంది . దీంతో ర‌క్తంలో షుగర్ లెవెల్స్ పెర‌గ‌వు.
డయాభేటీస్ కంట్రోల్ చేయడంలో పొడ‌ప‌త్రి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆకు చూర్ణంలో  యాంటీ డ‌యాబెటిస్ ల‌క్ష‌ణాలు పుష్కలంగా ఉంటాయి. అందువ‌ల్ల ర‌క్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి .
 అయితే పొడ‌ప‌త్రి ఆకు చూర్ణాన్ని తినడం వ‌ల్ల ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. అంటే ప్యాంక్రియాజ్ గ్రంథి ఉత్ప‌త్తి చేసే ఇన్సులిన్‌ను శ‌రీరం తొందరగా గ్ర‌హిస్తుంది. దీంతోపాటు ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గి, మధుమేహం అదుపులో ఉంటుంది.

ఈ ఆకు చూర్ణాన్ని రోజూ పరగడుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ మరియు ట్రై గ్లిజ‌రైడ్ స్థాయిలు త‌గ్గుతాయి. దీనితో గుండె సంబంధిత సమస్యలు  త‌గ్గుతాయి.
 ఉబగాయంతో బాధపడే వారు పొడ‌ప‌త్రి ఆకు చూర్ణాన్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.తీసుకోవాలి. శరీరంలోని చెడు కొవ్వును క‌రిగించేందుకు ఈ చూర్ణం ఎంత‌గానో సహాయపడుతుంది.అలాగే  కీళ్ళ వాతం,నొప్పులు సులభంగా త‌గ్గుతాయి.
ఈ ఆకు చూర్ణాన్ని రోజుకు 5 గ్రాముల మాత్రమే తీసుకోవాలి. మొదటగా ఒక గ్రాము తో మొదలు పెట్టి త‌రువాత మోతాదు పెంచుతూ పోవాలి.పొడ‌ప‌త్రి చూర్ణం క్యాప్సూల్స్ మనకు ఆయుర్వేద షాపు లో దొరుకుతాయి.ఈ ఆకుల‌తో త‌యారు చేసిన కషాయంను రోజుకు ఉదయాన్నే తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: