బరువు తగ్గాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి?

Purushottham Vinay
మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలంటే ప్రతి రోజు ఉదయం పూట క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. వ్యాయమంలో చురుకుదనం, వేగం ఉండాలి. ప్రతి రోజు కనీసం 40 నిమిషాల నుంచి గంట పాటు చేయడం ఉత్తమం. తెల్లవారిన తర్వాత చేసే వ్యాయామంతో ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఉదయం పూట అల్ఫాహారం మనేయొద్దు. అల్పాహారం మానేస్తే బరువు పెరుగుతారనే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా తక్కువ క్యాలరీలు, పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చక్కెరలు, ఉప్పు తక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అలాగే ఖచ్చితంగా మీరు సాయంత్రం పొడి పోహా స్నాక్స్ తినాలి. డ్రై పోహా స్నాక్ చేయడానికి, ఒక పాన్‌లో కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో పోహాను చేసుకోండి. మీరు ఇందులో వేరుశెనగలను కూడా చేర్చవచ్చు. సాయంత్రం పరిమిత పరిమాణంలో తినండి.


బరువు తగ్గడానికి క్వినోవా ఫైబర్  ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. సాయంత్రం పూట దీన్ని తీసుకుంటే రాత్రంతా ఆకలి వేయదు. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. మీరు మీ బరువు తగ్గించే రొటీన్‌లో క్విన్వా వెజ్ ఉప్మా తినవచ్చు. ఈ వంటకం నుండి ఫైబర్ మాత్రమే కాకుండా అనేక విటమిన్లు కూడా లభిస్తాయి.ఓట్స్‌లో ఫైబర్‌తో పాటు అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. సాయంత్రం పూట టిక్కీలు చేసుకుని ఓట్స్ తినవచ్చు. ఓట్స్ శరీరంలో సరైన మొత్తంలో ఫైబర్ ఉంచుతుంది. దీని కారణంగా జీవక్రియ స్థాయి కూడా సరైనది. ఓట్స్ టిక్కీ ప్రత్యేకత ఏమిటంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. కావాలంటే ఓట్స్ టిక్కీని బ్రేక్ ఫాస్ట్ లో కూడా తినొచ్చు.ఇంకా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం .. బరువు తగ్గాలనుకునే వారు, లేదా బరువు కోసం రొటీన్‌గా అనుసరించే వ్యక్తులు ఫైబర్ తీసుకోవడం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫైబర్ బలహీనత సమస్యను దూరంగా ఉంచుతుంది. అలాగే ఆకలిగా అనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: