షవర్ కింద స్నానం చేస్తున్నారా.. అయితే ఆ ప్రమాదం బారిన పడినట్టే..?

Divya
ప్రస్తుత కాలంలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కారణం మారిపోయిన ఆహారపు అలవాట్లు,సరైన వ్యాయామం లేకపోవడం వల్లే.. గుండెకు రక్తం సరఫరా చేసే నాలాలలో పూడిక ఉండడం వల్ల.. అక్కడక్కడ రక్తం గడ్డ కట్టడం వలన సమస్యలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్నిసార్లు షవర్ కింద స్నానం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా చల్లని నీటితో స్నానం చేసినట్లయితే ఈ ముప్పు చాలా అధికంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
గుండె సమస్యలతో ఇబ్బంది పడేవారు చల్లనీటి తో మాత్రం స్నానం చేస్తే గుండె వేగం ఎక్కువగా కొట్టుకోవడం లేదా.. స్లోగా కొట్టుకోవడం వంటివి జరుగుతుందట. చల్లని నీరు శరీరానికి షాక్ ఇచ్చేలా ఉంటుంది.. చల్లని నీటిని సంకోచించినప్పుడు రక్తప్రసరణ ఆగిపోయేలా అవుతుందట. ముఖ్యంగా బ్లడ్ సర్కులేటర్ స్లో అవ్వడం వల్ల శరీర భాగాలకు రక్తమందించేందుకు గుండె వేగంగా పనిచేయలేక పోతుందట. అందుచేతనే షవర్ కింద స్నానం చేస్తే గుండెపోటు వచ్చి అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

వేడి వాతావరణం ఉన్న సమయంలో చల్లని నీటితో స్నానం చేస్తే ఈ ప్రమాదం చాలా ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. చల్లని నీటిలో సడన్ గా మునిగిన శరీరానికి చాలా హానికరమట. బావులలో చెరువులలో ఈత కొట్టేటప్పుడు కూడా కోల్డ్ షాక్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలన నీటితో స్నానం చేయడానికి బకెట్ ఉపయోగించడం చాలా మంచిదట. నీతిని నెమ్మదిగా కోసుకుంటే స్నానాన్ని ప్రారంభించాలి అంతే కానీ ఒకేసారి తలపై గాని శరీరంపై గాని నీళ్లను పోసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేయడం జరుగుతోంది.. అందుచేతనే ఎవరైనా సరే చల్లని నీటితో స్నానం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: