టాయిలెట్ కి వెళ్లి ఫోన్ వాడుతున్నారా? అయితే ముప్పే!

Purushottham Vinay
ఇక ఫోన్‌ లేకపోతే రోజు గడవలేని స్థితికి వచ్చేంశాం. ఒక రకంగా చెప్పాలంటే దాని గుప్పిట్లో మనల్ని బాగా బంధించేసింది. మొబైల్ ఫోన్ అనేది చాలా ఉపయోగకరమైన పరికరమే! దీనిలో ఇక ఎటువంటి సందేహం లేదు.ఇక టాయిలెట్‌కి వెళ్లిన వ్యక్తి చేతిలో ఫోన్‌ ఉంటే రెండు చేతులు సరిగ్గా కడుక్కోలేకపోవడం మొదటి కారణం. ఆ తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోని ఆ చేత్తోనే తినటం కూడా జరుగుతుంది. ఫలితంగా హానికరమైన వైరస్‌లు ఇంకా బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తాయి. ఇది అతిసారం, జీర్ణ సమస్యలు ఇంకా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఈ భయంకరమైన సమస్యలు మన దైనందిన జీవితాన్ని బాగా అతలాకుతలం చేస్తాయి.టాయిలెట్‌ సీట్‌పై ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే మలద్వారంతోపాటు అంతర్గత అవయవాలపై కూడా చాలా అదనపు ఒత్తిడి పడి పైల్స్ సమస్యలకు దారి తీస్తుంది.టాయిలెట్లలో భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. టాయిలెట్‌లోకి మొబైల్ ఫోన్‌తో వెళ్తే ఆ బ్యాక్టీరియా మీ మొబైల్ ఫోన్‌కు కూడా అంటుకుంటుంది. చేతుల ద్వారా ఆ బ్యాక్టీరియా మీ నోటిలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.


ఇక మొబైల్ ఫోన్‌తో టాయిలెట్‌లోకి వెళ్లే అలవాటును మానుకోవాలి. కానీ చాలామంది కూడా మలవిసర్జన చేయడానికి అధిక సమయం తీసుకుంటారు. దీంతో వారు మొబైల్ ఫోన్లతో టాయిలెట్‌లో ఎక్కువ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు టాయిలెట్లోకి ప్రవేశించే ముందు కొంత సమయం అనేది వ్యాయామం చేయాలి. రాత్రి, ఉదయం చిటికెడు వాము తిన్నా కూడా బాగా పనిచేస్తుంది. ఈ రెండు పద్ధతులు పాటిస్తే త్వరగా స్టమక్‌ అనేది క్లియర్ అవుతుంది. మీకు టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చోవాల్సిన అవసరం కూడా ఉందడు. అయితే చాలా మంది టాయిలెట్‌లో కూర్చుని ఆఫీసు పనులు కూడా చేస్తుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే టాయిలెట్ లోపల స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకుండా మీరు నిరోధించవచ్చు. తత్ఫలితంగా మీ ఆరోగ్యం అనేది మరెంతో పదిలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: