ఎత్తు ఎక్కువ ఉన్నారా అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!!

Divya
చాలామంది ఎత్తు లేమని కాస్త పొట్టిగా ఉన్నామని బాధపడుతూ ఉన్న వాళ్ళను చాలా మందిని చూస్తూ ఉన్నాము. అయితే ఎత్తు పెరిగేందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎత్తు ఉంటే కొన్ని లాభాలు రావడంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరుగుతోంది. తాజా సర్వేలో తెలిపిన ప్రకారం నరాలు దెబ్బతినడం, చర్మం, ఎముకల ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. ఇక అంతే కాకుండా ఎక్కువ ఎత్తు ఉన్న వారికి అధిక రక్తపోటు, అధిక కొవ్వు వంటి రిస్కులు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఎత్తుకు, వ్యాధులకు గల సంబంధాల గురించి పలు అధ్యయనాలలో తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.
ఎత్తు ఎక్కువగా ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయో అన్నదానిపై పరిశోధకులు పరిశీలించగా వేలాదిమంది క్లినికల్ రికార్డుల ప్రకారం 3,23,793 మంది రికార్డులను పరిశీలించారు. ఎత్తు వల్ల పలు వైద్య లక్షణాలతో ముడిపడి ఉందని వైద్యులు నిర్ధారించారు. ఒక వ్యక్తి మినిమం పొడవు పెరగడానికి ఆ వ్యక్తికి అవసరమైన పోషకాలను తీసుకోవాలి. అంతే కానీ ఏవైనా లేజర్ వంటి పరికరాల ద్వారా ఆపరేషన్ చేయించి ఎత్తు పెరగడం అన్నది అసాధ్యం అని చెప్పవచ్చు. ఒకవేళ అలాంటి చేయించిన కూడా అవి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి.

మన హైట్ ను బట్టి మన ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవచ్చు.5.8 అంతకంటే ఎక్కువ ఉండే వాళ్లలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇలాంటి వారికి గుండె సమస్యలు రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందట. మహిళలు 5.2 కంటే తక్కువ హైట్ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ విషయంలో చాలా సమస్యలు ఫేస్ చేయవలసి ఉంటుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యావరేజ్ హైట్ కంటే తక్కువ ఉన్నవారిలో పెరాలసిస్ సూపర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అందుచేతనే మినిమం హైట్ గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: