గుడ్ న్యూస్: క్యాన్సర్ ని పూర్తిగా నయం చేసే మందు వచ్చేసింది!

Purushottham Vinay
ఇక వైద్య చరిత్రలోనే మరో అద్భుతం అనేది ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి ఓ డ్రగ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది.మల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. అలాగే 18 మంది రోగులకు దాదాపు ఆరు నెలల పాటు దోస్టార్‌లిమాబ్ అనే ఔషధాన్ని కూడా ఇచ్చారు. ఆరు నెలల తర్వాత పరీక్షలు చేస్తే వారిలో క్యాన్సర్ కణాలు పూర్తిగా మాయమైనట్టు వారు గుర్తించారు.దోస్టార్లిమాబ్ అనే ఔషధం మానవ శరీరంలో ప్రత్యామ్నాయ ప్రతిరోధకాలును కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇక మొత్తం 18 మల క్యాన్సర్ రోగులకు ఇదే మందుని ఇచ్చారు. చికిత్స ఫలితంగా ప్రతి రోగిలో కూడా క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నిర్మూలనైంది.ఇక ఆ 18 మందికి ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లేదా PET స్కాన్‌లు ఇంకా అలాగే MRI స్కాన్‌ ఏ పరీక్షలు చేసినా క్యాన్సర్ కణాలు కనిపించలేదు.


ఇక న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ లూయిస్ ఎ. డియాజ్ జె మాట్లాడుతూ... "క్యాన్సర్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి" అని వారు అన్నారు.అలాగే న్యూయార్క్ టైమ్స్ ప్రకారం క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న రోగులు క్యాన్సర్‌ తగ్గ ముందు కూడా చాలా చికిత్సలు కూడా తీసుకున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ ఇంకా అలాగే ఇన్వాసివ్ సర్జరీలు కూడా జరిగాయి. అయినా కానీ వాళ్లకు ప్రయోజనం కనిపించలేదు. ఇక చివరి ప్రయత్నంగా 18 మంది రోగులపై దోస్టార్లిమాబ్‌ను ప్రయోగించి చికిత్సని అందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వారు చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరిచే విధంగా మంచి ఫలితాలని ఇచ్చింది.ఇక ఈ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో పెద్ద సంచలనం రేపుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మంచి కొలొరెక్టల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అలాన్ పి. వేనూక్ మాట్లాడుతూ... ప్రతి ఒక్క క్యాన్సర్‌ రోగికి కూడా పూర్తి ఉపశమనం అనేది ఇప్పటి వరకు వినలేదని వారు అన్నారు. ఇప్పుడు జరిగిన పరిశోధన ఫలితాలు మాత్రం వైద్య చరిత్రలోనే మొదటిదని వారు అభిప్రాయపడ్డారు. ట్రయల్స్‌లోనే మంచి ఫలితాలు సాధించిన ఈ కచ్చితంగా ప్రత్యేకమైందని ఇంకా అందర్నీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: