కరోనా: మళ్లీ ఆ రెండు రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులు..!!

Divya
గత రెండు రోజులుగా దేశంలో మళ్లీ కరొనా వైరస్ కేసులు పెరుగుతున్నాయనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం ఒక్క రోజులోనే కొత్త ఇన్ఫెక్షన్ సోకడంతో సుమారుగా 9 శాతం వరకు కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా కరోనా కేసులు 4041 రాగా దేశంలో యాక్టివ్ గా ఉన్న రోగుల సంఖ్య ప్రస్తుతం..21177 చేరింది. పాజిటివ్ రేటు కూడా..0.95 శాతానికి పెరిగిపోయింది. దేశంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాలలో భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కేరళ వంటి ప్రాంతాలలో కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తోంది అన్నట్లుగా సమాచారం. ఈ రాష్ట్రాలలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య తో పాటు కరొనా పాజిటివ్ రేటు కూడా వేగంగా దూసుకుపోతోంది. గడిచిన 24 గంటలలో దేశంలో నమోదయిన మొత్తం కేసులలో 34 శాతం కేరళ నుంచి మాత్రమే నమోదయ్యాయట.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెరుగుతున్న కేసును మళ్లీ కోవిడ్ విజృంభణకు సంకేతమా అన్నట్లు గా ఒక ప్రశ్న తలెత్తుతోందిని అధికారులు చాలా ఆందోళన చెందుతున్నారు. అందుకు సంబంధించి కోవిడ్ నిపుణుడు డాక్టర్.. ముద్వీర్ సింగ్.. మాట్లాడుతూ పెరుగుతున్న కేసులు ఏ కొత్త వైరస్ కు సంకేతం కాదని కేవలం రెండు ఉప వేరియంట్లు కారణం అని తెలియజేశారు. దేశంలో కొంతమందికి ఇప్పటికే వ్యాక్సిన్ అందలేదు అటువంటి పరిస్థితిలో వ్యాక్సిన్ తీసుకొని వ్యక్తులు ఈ వేరేది బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. ఇక ఈ వేరియంట్ లక్షణాలు కూడా ఒమిక్రన్ లక్షణాలుగా ఉంటాయట.
కేరళ మహారాష్ట్ర లో పెరుగుతున్న కేసులపై వైద్య అధికారులు స్పందించడం జరిగింది గతంలో ఇదే విధంగా కూడా ఢిల్లీలో కరోనా కేసులు పెరిగాయని చెప్పారుm ఇప్పుడు కూడా అదే విధంగా మహారాష్ట్ర కేరళ పెరుగుతున్నాయని అంటున్నారు భవిష్యత్తులో కూడా అన్ని ప్రాంతాలలో పెరుగుతూనే ఉంటాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: