ఆహారం తిన్న వెంటనే నీటిని తాగాలా? వద్దా?

Purushottham Vinay
ఇక ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా 10 నుంచి 12 గ్లాసుల దాకా ఖచ్చితంగా నీటిని తాగాలి. అయితే కొంతమంది మాత్రం నీటిని తప్పుడు సమయంలో తాగుతుంటారని..ఇక దీని కారణంగా శరీరం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అన్నం తిన్న వెంటనే నీటిని తాగాలా..? వద్దా..? తాగితే పరిస్థితి ఏంటీ.. అనే అనేక ప్రశ్నలు ప్రజల మదిలో బాగా మెదులుతుంటాయి.అన్నం తిన్న వెంటనే నీరు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే మన జీర్ణక్రియ నిర్వహణ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి 2 గంటల సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ వేడి వెంటనే చల్లబడతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనిని బాగా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆహారం తిన్న 45 నుంచి 60 నిమిషాల తర్వాత నీటిని తాగాలి. ఇక ఇది కాకుండా.. మీరు భోజనానికి అరగంట ముందు కూడా నీటిని తాగవచ్చు. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం ఇంకా అలాగే ఎసిడిటీ వంటి అనేక రకాల సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.


ఇక నీరు తాగడానికి సరైన సమయం ఇదే..ఒక వ్యక్తి తిన్న ఒక గంట తర్వాత నీరు తాగితే అతని బరువును నియంత్రించవచ్చు. అలాగే అధిక బరువు తగ్గాలనుకునే వారు తిన్న ఒక గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి.అలాగే ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి రెండు గ్లాసుల నీటిని కనుక తీసుకుంటే, జీర్ణవ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది.అలాగే ఉదయాన్నే పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా జీవక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది.ఆహారం తిన్న ఒక గంట తర్వాత నీరు తాగడం వల్ల గ్యాస్ ఇంకా అలాగే ఎసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా మీరు ఉపశమనం పొందవచ్చు.అలాగే భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు కూడా చాలా బాగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: