కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ఆప్తుల్ని కోల్పోయారు. అలాగే చాలామంది తమ జీవనాధారాలను కూడా కోల్పోయారు. కరోనా వైరస్ మహమ్మారి చేసిన డ్యామేజ్ అసలు అంతా ఇంతా కాదు. ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారు కూడా ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కుంటున్నారు. తాజాగా ఐఐటీ బొంబాయి జరిపిన అధ్యయనంకి సంబంధించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని(impair fertility) ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనను ఐఐటీ బొంబాయి(IIT Bombay) తో కలిసి జస్లోక్ హాస్పిటల్ ఇంకా రీసెర్చ్ సెంటర్ సైంటిష్టులు సంయుక్తంగా నిర్వహించారు.కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న పురుషులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగుచూసింది. మైల్డ్ సింటమ్స్తో కరోనా సోకి.. రికవర్ అయినవారికి కూడా సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను ఇక ఏసీఎస్ ఒమెగా జర్నల్ గతవారం పబ్లిష్ చేసింది.
కరోనా వైరస్ కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తుందని ఇక దాంతో పాటు ఇతర వ్యవస్థలను కూడా డ్యామేజ్ చేస్తుందని పరిశోధకులు కనుగొనడం జరిగింది. అంతేకాదు, కరోనా మహమ్మారి కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని కూడా వారు వివరించారు.అలాగే 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కరోనా వైరస్ సోకి రికవర్ అయిన వారి వీర్యం శాంపిల్స్ ని కూడా విశ్లేషించినట్లు పేర్కొన్నారు.ఇక ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చగా.. కరోనా వైరస్ సోకిన వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్లు వారి పరిశోధనల్లో వెళ్లడయింది. అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1ఇంకా ప్రోసాపోసిన్ కోలుకున్న వారిలో తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, ఈ అంశంపై ఇంకా లోతైన అధ్యయనాలు అనేవి జరగాలని సైంటిష్టులు చెబుతున్నారు.