రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారం ఏమిటో తెలుసా..?
మనల్ని ఈ వైరస్ ఏమి చేయకుండా ఉండాలి అంటే అందుకు తగ్గట్టుగా మన శరీరంలో ఇమ్యూనిటీపవర్ కూడా పెరగాలి. అలా ఇమ్యూనిటీపవర్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి. మాంసం, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ , తాజాపండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ కారణంగా మనలో ఇమ్యూనిటీపవర్ పెరుగుతుంది. ఆకుకూరలు, దుంపలు వంటివి ఎక్కువగా ఉడికించకూడదు. వీలైనంతవరకు పచ్చిగా తినడం వల్ల వాటిలో ఉండే మినరల్స్, విటమిన్స్ లభించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
వీలైనంత వరకు ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి ఇక ప్రతిరోజు గుప్పెడు డ్రైఫ్రూట్స్ తో పాటు మొలకెత్తిన గింజలను కూడా తినాలి. అలాగే రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజపరిచి.. మెదడు కూడా చాలా చురుకుగా పని చేస్తోంది. అంతేకాదు ప్రతి రోజు సూర్యరశ్మిలో ఉంటూనే సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభించి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి రోజు వాకింగ్ చేయడం , యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉంటారు.