ఎసిడిటీ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందని మీకు తెలుసా..?
నిరంతరంగా వచ్చే యాసిడిటీ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అనే వ్యాధి కి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాసిడిటీ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందట.. యాసిడిటీ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి కింద చదివితే తెలుస్తుంది. వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ ఎసిడిటీని అనుభవించే వ్యక్తులు GERDని కలిగి ఉండవచ్చు అని సమాచారం.
GERD వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే
చెడు శ్వాస.. దగ్గు.. ఆహారం మింగటంలో ఇబ్బంది.. గుండెల్లో మంట.. వాంతులు.. వికారం .. ఇటువంటి సమస్య అని సాధారణ లక్షణాలు గా పరిగణించవచ్చు. కాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. పడుకోవడానికి రెండు మూడు గంటల కంటే ముందుగానే భోజనం చేయడం తప్పనిసరి . ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. నిరాడంబరమైన భోజనం, భోజనాన్ని ఎక్కువ సేపు నమిలి మింగడం లాంటి కారణాల వల్ల ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు.
అసిడిక్ , జిడ్డు, ,స్పైసీ , కొవ్వు ఫుడ్స్ వల్ల అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. టొమాటో సాస్, పుదీనా, వెల్లుల్లి, సిట్రస్, ఉల్లిపాయలు, డార్క్ చాక్లెట్ వంటివి ఆమ్లత్వాన్ని ప్రేరేపించే ఇతర ఆహారాలు కూడా తినకపోవడమే మంచిది. కొద్ది పరిమాణంలో తీసుకుంటే సమస్యలు తలెత్తవని గుర్తుంచుకోవాలి.