విటమిన్ ఎ లోపం గుర్తించడం ఎలా..?
మనం ఎప్పుడైతే పోషక ఆహారాన్ని సరిగా తీసుకోకపోతే అప్పుడు విటమిన్ ఎ లోపం ఏర్పడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల అంధత్వానికి కూడా కారణం అవ్వచ్చు. తరచుగా అంటువ్యాధులు, రేచీకటి, కంటిలోని కార్నియా పొడిబారడం , రోగ నిరోధక శక్తి బలహీనపడటం , పిల్లల ఎముకలకు సరైన అభివృద్ధి లేకపోవడం, సంతానలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి అని వైద్యులు చెబుతున్నారు. ఇక మన లో విటమిన్ ఎ లోపించడం వల్ల పురుషులు అలాగే స్త్రీలలో వ్యంధత్వ సమస్యలు తలెత్తుతాయి.
గర్భం దాల్చడం లో ఆలస్యం అవడం .. సంతానోత్పత్తి మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మం పొడిగా మారిపోవడం, తామర , దురద, వాపు, పెదవులు పొడిబారిపోవడం వంటి సమస్యలు అధికమవుతాయి. ఇక ఎముకలు శక్తి కోల్పోవడం.. గాయాలు తగిలితే త్వరగా మానకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. విటమిన్ ఎ అనేది చర్మానికి ఒక ఆరోగ్యకరమైన విటమిన్ . ఇది కొల్లాజెన్ ను నిర్మించడంలో చాలా బాగా సహాయపడుతుంది. మొటిమలు, ముడతలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.
ఇక విటమిన్-ఎ లోపాన్ని రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఇక విటమిన్ ఎ మనకు ఎక్కడ లభిస్తుంది అంటే.. చేపలు ,ఆకుకూరలు, క్యారెట్, పాల ఉత్పత్తులు, పాలు, జున్ను, మామిడి, పుచ్చకాయ , నేరేడు పండ్లు, పాలకూర, కాడ్ లివర్ ఆయిల్ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తుంది.