నాన్ స్టిక్ పాన్ మీద వేసే దోశ తింటే ఎన్ని జబ్బులో తెలుసా?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో దాదాపు అందరు కూడా తమ ఆహారం కోసం ఎక్కువగా ఈ నాన్ స్టిక్ పెనంని వాడుతున్నారు. ముఖ్యంగా పొద్దున పూట తినే అల్పాహారం అయిన దోశను నాన్‌ స్టిక్ పెనంపై వేస్తుంటారు. ఎందుకంటే దీనికి పిండి అట్టుకోదు ఇంకా దోశ బాగా వస్తుంది.ఇక అందుకే చాలా మంది కూడా ఇనుప పెనాన్ని పక్కన పడేసి నాన్‌స్టిక్‌ పెనం తెచ్చుకోని దానిలో దోశలు వేసుకొని తింటున్నారు. కానీ నాన్ స్టిక్ ప్యాన్ అనేది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే దీన్ని అసలు వాడరు. ఈ నాన్ స్టిక్ పాన్ వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు చాలా ఈజీగా తలెత్తే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చాలా ఖచ్చితంగా చెబుతున్నారు.ఇక నాన్ స్టిక్ ప్యాన్‌పై పిండి వేసిన తర్వాత ఆ పిండి దానికి అంటుకోకుండా ఉంటుంది. అందువల్ల దోశ బాగా వస్తుంది. అయితే దోశ అలా బాగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పెనం మీద ఉండే కోటింగ్ అనే చెప్పాలి. ఆ కోటింగ్ వల్లే దోశ బాగా వస్తుంది.



ఎందుకంటే ఆ కోటింగ్ ని టెఫ్లాన్‌తో వేస్తారు. టెఫ్లాన్ అనేది ఒక ప్రమాదకరమైన రసాయన పదార్థం. ఇలా కెమికల్స్ తో తయారైన కోటింగ్ తో వేసిన ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు ఇంకా అలాగే కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు ఎంతగానో వివరిస్తున్నారు. ప్యాన్ ని వేడి చేయడం వల్ల టెఫ్లాన్ కరిగి ఆహారంలో కలుస్తుందట. దాని వల్ల ఆ కెమికల్ డైరెక్ట్ గా మనిషి శరీరంలోకి వెళ్తుంది. అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి అసలు కెమికల్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇనుప పెనం మీద చేసిన ఆహారంని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కాబట్టి నాన్ స్టిక్ పాన్ మీద దోశ వేసుకొని అసలు తినకండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: