శరీరంలో విషాలను బయటకు పంపించే బెస్ట్ మెడిసిన్..!!

Divya
శరీరం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడు అంతర్గత అవయవాలు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఇకపోతే శరీరంలో జరిగే ఎన్నో జీవక్రియ ప్రక్రియల సమయంలో సాధారణంగా శరీరంలో వివిధ రకాల విషపదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని టాక్సిన్స్ అని కూడా అంటారు. ఇకపోతే మన శరీరంలో టాక్సిన్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే.. మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారాలు, లైఫ్ స్టైల్ లో మార్పులు, వాతావరణంలో కలుషితం ఇలా అన్నింటి వల్ల కూడా మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా ప్రారంభమవుతాయి.. అందుకే ఈ టాక్సిన్స్ పేరుకుపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..


మన శరీరంలో పేరుకుపోయిన ఈ టాక్సిన్స్ ను ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకోవాలి.. అప్పుడే మనం ఆరోగ్యంగా జీవిస్తాము.. ఇక మనకి ఎన్నో కూరగాయలు, జ్యూసులు, పండ్లు సేవించడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడం సహాయపడతాయి.. అయితే ప్రతి ఒక్కరూ అలవాటు పరచుకోవాల్సిన చిన్న విషయం ఏమిటంటే తాము తీసుకునే ఆహారంలో తాజా పండ్లను చేర్చుకోవడం.. తాజా పండ్లలో అవసరమైన విటమిన్లు , ఖనిజాలు ఉండడం వల్ల ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను ఈ పండు కలిగి ఉంటుంది.. కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది..

ముఖ్యంగా మనం తీసుకోవలసిన పండ్లు విషయానికి వస్తే ఆపిల్ ను ఖచ్చితంగా రోజు ఒకటి తినాలి. ఇందులో ఉండే విటమిన్లు , ఫైబర్ ఖనిజాలతో పాటు ఫైటోకెమికల్స్ , కెప్టెన్ లను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే పెక్టిన్ శరీరంలోని రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను,  లోహాలను విసర్జించడానికి సహాయపడుతుంది.. అంతేకాదు ఆపిల్ ను  తొక్కతో సహా తినడం వల్ల విటమిన్ సి, పీచు పదార్థాలు పూర్తిగా శరీరానికి లభిస్తాయి.

ఇక వీటితో పాటు నిమ్మరసం, బెర్రీలు, పైనాపిల్, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: