పొట్టపై ఉండే చారలు ఇలా చేయడం వల్ల పోగొట్టవచ్చు..!!
1). ఆలోవెరా:
కలబంధ చర్మ సంబంధిత వ్యాధులన్నిటినీ చెక్ పెట్టేస్తుంది. స్కిన్ కాంతివంతంగా చేసే గుణం కలబంద కి ఉంటుంది. పొట్ట పై ఉన్న చారలకు విరుగుడుగా ఈ కలబంద పనిచేస్తుంది. కలబంద గుజ్జును కాస్త ఆ స్ట్రిచ్ మార్క్ పైనా పట్టించి కొద్దిసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి
2). కోకోవా బటర్:
చర్మ సౌందర్యాన్ని కోకోవా బటర్ ఇనుమడింపచేస్తుంది.. దీంతో రాత్రి పడుకునే సమయంలో మసాజ్ చేసుకుంటే అవి తొలగిపోతాయట.
3). ఆముదం నూనె:
జుట్టుకు నిగారింపు రావాలంటే ఆముదం నూనెను వాడుతాము.. అలాగే చర్మం పై రాసినప్పుడు కూడా అలాంటి షైనింగ్ ఏ వస్తుంది కాబట్టి.. స్ట్రెచ్ మార్క్ ఉన్నచోట ఈ ఆముదాన్ని రాస్తే ఫలితం దక్కుతుంది.
4). కీరా- నిమ్మపండు:
నిమ్మ రసం లో ఎసిడిటి ఉండడం వల్ల, చర్మం బాగా పల్చగా అవుతుంది.. ఇక కీర దోసకాయ గుజ్జును.. నిమ్మపండు రసంతో కలిపి స్ట్రెచ్ మార్క్ పైన రాస్తే అవి తగ్గుముఖం పడతాయి.
ఇవన్నీ సహజసిద్ధంగానే దొరికేవి కావున మనం ఉపయోగించుకోవచ్చు.