ఎండుద్రాక్షతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా?

Purushottham Vinay
కొన్ని కొన్ని పద్ధతులను పాటిస్తుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన చేతుల్లోనే పెట్టుకోవచ్చు. అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లేదానికంటే కొన్ని చిట్కాలను పాటిస్తుంటే చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు.ఇక మన ఇంట్లో వుండే ఎండుద్రాక్ష వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట. వీటిలో యాంటీయాక్సిడెంట్లు ఇంకా అలాగే పీచు పదార్థం ఉండటం వల్ల రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చే శక్తి కూడా ఈ ద్రాక్షలో ఉంది. క్రమం తప్పకుండా రోజు ఐదారు ఎండు ద్రాక్షాలు కనుక తిసుకుంటే చిన్న పేగుల్లో ఉండే వ్యర్థ పదార్థాలు అన్ని కూడా బయటకు పంపించేస్తుంది. ఎండు ద్రాక్షలో పీచు ఉండటం వల్ల ఇది కడుపులోని నీటిని పీల్చేస్తుంది.అందువల్ల విరేచనాలు ఇంకా అలాగే ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.ముఖ్యంగా స్త్రీలకు ఎండు ద్రాక్షాలు ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఈ ఎండు ద్రాక్ష అనేది తయారవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 70 నుంచి 80 శాతం  దాకా కూడా వైన్‌ తయారీలో ఈ ఎండు ద్రాక్షాని ఉపయోగిస్తుంటారు.ఎండు ద్రాక్షా మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి.ఇది కొన్ని రకాల వ్యాధులను దూరం చేస్తుంది. వీటి వల్ల రోగ నిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది.ఆటలు ఆడేవారికి ఎండుద్రాక్ష తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.ఎండు ద్రాక్షాలు హైబీపీ ఇంకా క్యాన్సర్‌ దరిచేరకుండా ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో వుండే యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలు రాకుండా వాటిని దూరం చేస్తాయి. అలాగే హైబీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఇవి శరీరంలో రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో వుండే ఒత్తిడిని తగ్గించి చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఇంకా అలాగే ఐరన్‌ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: