పులిపిర్లను.. వదిలించుకోవాలంటే ఇలా చేస్తే సరి..!

Divya
ఇప్పుడు ఎక్కువగా అందరూ చర్మ సౌందర్య మీద దృష్టి పెడుతున్నారు. ఇక అలా ముఖం మీద ఎలాంటి చిన్నటి పింపుల్స్, గుల్లలు లేచిన అందుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అయితే వీటికి అయితే ట్రీట్మెంట్ ఉంది కానీ, పులిపిర్లు వంటికి ట్రీట్మెంట్ ఉందా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు తెలిపిన మేరకు వాటిని పూర్తిగా నివారించలేము.. కానీ అణిచివేయాగలమని తెలియజేశారు. అయితే ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.

ముందుగా మన వంటింట్లో దొరికేటువంటి వెల్లుల్లి పైన ఉండేటువంటి పొరను పులిపిరులపైన బాగా రుద్దాలి. ఎందుకంటే అందులో కొన్ని యాంటి వైరల్ అనే లక్షణాలు ఉంటాయి కనుక. ఇలా ఒక నెలలో కనీసం 3 వారాల పాట ఇక్కడ వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఉల్లిపాయను సగ భాగం చేసి.. అందులో ఉండేటువంటి మధ్యభాగాన్ని తొలగించి.. రాళ్ల ఉప్పు తో దానిని నింపాలి. 5 నిమిషాల తర్వాత కలిసిపోయి ఒక మిశ్రమ ద్రావణం గా ఏర్పడతాయి. ఆ ద్రావణాన్ని  తీసుకొని ఒక నెల రోజులపాటు పులిపిరులపైన పట్టించాలి.
ఇక మరొక ఔషధం ఏమిటంటే ఆముదం చెక్క నుండి వచ్చిన ఆముదాన్ని పులిపిరులపైన మూడు చుక్కలు వేసి.. గాలి ఆడకుండా పులిపిరులపైన ఏదైనా టేప్ అతికించాలి. ఇలా 2 వారాలు చేసినట్లైతే తగిన ఫలితం కనిపిస్తుందట.
ఒకవేళ మన ఇంటి చుట్టు దొరికే ఉత్తరేణి మొక్కలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను తులసి ఆకులతో బాగా నూరి పట్టిస్తే.. పులిపిర్లు తగ్గుతాయట. అలా పట్టించిన తర్వాత వస్తా ఆవనూనె పట్టిస్తే మేలట.
ఫ్రెష్ గా ఉండేటువంటి సున్నాన్ని.. పులిపిరులపైన మన రాస్తే వాటంతట అవే రాలిపోతాయి. అల్లం బాగా ఊరిన తర్వాత అందులో కి కొత్త సున్నాన్ని వేసి పులిపిరులపైన పట్టిస్తే అవి రాలిపోతాయి. కేవలం పులిపిర్ల మీదే పట్టించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: