ఒత్తిడిని తగ్గించుకోడానికి ఇలా చెయ్యండి.

Purushottham Vinay
ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజూ కూడా 5 నుంచి 10 నిమిషాలు పాటు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అలాగే మంచి ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక అలాగే క్రమం తప్పకుండా కనుక చేయడం చేస్తే మీరు ఖచ్చితంగా ఈ ఒత్తిడి నుంచి వెంటనే బయటపడుతారు.ఇక అంతేకాదు ఇలా చేస్తే మీ ఆందోళన స్థాయి కూడా వెంటనే తగ్గుతుంది.ఇక అరోమాథెరపీ చేయడం వల్ల కూడా మీకు ఒత్తిడి అనేది తగ్గి మీ మానసిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఇది ఖచ్చితంగా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే మీకు ఎక్కువ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.ఇక అలాగే మీ అనుభవాలు, భయాలు ఇంకా ఆలోచనల గురించి ప్రతిరోజూ మర్చిపోకుండా ఒక బుక్‌ తీసుకుని అందులో రాయండి. ఈ థెరపీ చెయ్యడం వలన మీ మానసిక ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. ఇక ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీరు వదిలిపెట్టిన పనులు ఇంకా అలాగే భవిష్యత్‌లో చేయాల్సిన పనులు అన్ని కూడా మీకు గుర్తుకువస్తాయి. అందువల్ల మీకు మంచి రిలీఫ్ అనేది ఉంటుంది.అందుకే రాయండి.

ఇక అలాగే ఒత్తిడి ఇంకా ఉద్రిక్తత నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ కూడా కొద్దిసేపు మరచిపోకుండా ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి.ఇక ఈ వ్యాయామం క్రమం తప్పకుండా రోజు చేయడం ద్వారా మీరు మంచి రిలాక్స్‌ అనేది పొందుతారు.అలాగే మీ జీవక్రియ రేటు కూడా బాగా మెరుగుపడుతుంది.ఇక అలాగే రోజూ కూడా సరైన సమయానికి కంటినిండా కూడా బాగా నిద్రపోవాలి. ఉదయం తప్పనిసరిగా వాకింగ్‌ అనేది చేయాలి. అప్పుడు మీకు తప్పకుండా మార్పు అనేది వెంటనే కనిపిస్తుంది. అలాగే నిద్రించడానికి 3 నుంచి 4 గంటల ముందు ఖచ్చితంగా చెయ్యాల్సిన పని ఏంటంటే మీ మొబైల్, ఐఫోన్ ఇంకా అలాగే టీవీని ఉపయోగించడం మానేయడం.ఇలా చేస్తే కచ్చితంగా మీరు ఒత్తిడి నుంచి బయటపడటం జరుగుతుంది.ఇక అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితో ఆడుకోండి. వారితో రోజు ఒక గంట అయినా ఆడుకోవడం వల్ల మీకు ఒత్తిడి సమస్య అనేది పూర్తిగా తగ్గి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: