మునగకాయల్లో ఆరోగ్య రహస్యం

Vimalatha
మునక్కాయలు తరచుగా కూర చేసుకుని తింటూనే ఉంటాము. అయితే దానిలో ఉండే రుచి తెలుసేమో గాని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలామందికి తెలియవు. మునగకాయలను ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే ఉపయోగిస్తారు. మునగకాయలను స్పిరులినా అని కూడా అంటారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి మునగకాయలి సూపర్ గా పని చేస్తాయి.
మునగకాయల్లో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో పాటు అనేక ఇతర అద్భుతమైన పోషకాలు ఉంటాయి. దీనిని హిందీలో మోరింగ అంటారు. మునగ మన శరీరాన్ని ప్రాణాంతకమైన బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. రెగ్యులర్ గా దీనిని తింటే ఎముకలను బలపరుస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది.
మునగకాయల్లో పోషకాలు -
విటమిన్ సి, ఎ, కాల్షియం సమృద్ధిగా ఉండే మునగకాయలలో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఒక పరిశోధనలో ఆరెంజ్‌లో కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్‌ల కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ మునగకాయలలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆరోగ్యకరమైన శరీరానికి ఈ పోషకాలన్నీ చాలా ముఖ్యమైనవి.
మునగకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను అధిగమించడానికి మునగ మంచి ఉపాయం. మోరింగలో చాలా ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, ఫైబర్, విటమిన్లు బి, సి, ఇ ఉన్నాయి.
మునగకాయలతో అద్భుతమైన ప్రయోజనాలు :
మునగకాయలలో రక్తంలో చక్కెర నియంత్రణను తగ్గించడానికి పని చేసే ఫైటోకెమికల్స్ ఉంటాయి.
ట్రిప్టోఫాన్ అనే ఒక రకమైన ప్రోటీన్ మునగకాయలలో ఉంటుంది. ఇది మెదడులోని మెమరీ కణజాలాలను చురుగ్గా పని చేసేలా చేస్తుంది. ఇది మెదడును పదునుగా చేసి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
మునగ ఆకులు పొట్టకు ఎంతో మేలు చేస్తాయి. ఇది జీర్ణ ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్, గ్యాస్ట్రిటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి మునగ చాలా అవసరం. మొరింగ ఆకులు శోథ నిరోధక స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి అవి ఆర్థరైటిస్‌ను నివారించడంలో, ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
మునగ ఆకులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను కాపాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: