ఈ చిట్కాలతో "వర్క్ ఫ్రమ్ హోమ్" ను ఎంజాయ్ చేయండి ?

VAMSI
కరోనా పుణ్యంతో మన జీవితాలు సంకనాకిపోయే అంత దాకా వెళ్లి తిరిగి వచ్చాము. చాలా మంది తమ ప్రాణాలను ఈ మహమ్మారి కరోనా వైరస్ కి కోల్పోయారు. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలోనే అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. కొన్ని కంపెనీలు కొంత కాలం వరకు మాత్రమే కొనసాగించగా మరి కొన్ని కంపెనీలు దీర్ఘ కాలం ఇదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించడానికి ఆసక్తిని కనబరిచాయి. అయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వలన ఎంతో కొంత కంపెనీలకు మాత్రమే లాభం చేకూరనుంది. అందుకే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడినప్పటికీ ఆఫీసులలో వర్క్ చేయడానికి అనుమతించలేదు.
కానీ ఒక సర్వే ప్రకారం ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తున్న వారికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆఫీసులో అయితే నిర్ణీత సమయం మాత్రమే వర్క్ చేసేవారు. ఆఫీస్ వాతావరణం వేరుగా ఉంటుంది. బోర్ కొట్టకుండా కొలీగ్స్ తో టైం స్పెండ్ చేయవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇంటి దగ్గర పనిచేస్తూ ఉండడం వలన ఇలా చిన్న చిన్న ఆనందాలకు దూరం అయ్యే పరిస్థితి.
ఇది కాకుండా ఆఫీసులో సీటింగ్ లాగా మనకు ఇంటి దగ్గర ఉండదు. ఏదో చైర్ ఉంటుంది అందులోనే కూర్చుని పనిచేసుకోవాలి. అంత సౌకర్యవంతంగా ఉండదు. ఈ విషయాన్ని గమనించిన కొన్ని కంపెనీలు ఇంటి దగ్గర వర్కర్స్ కు ఆఫీస్ చైర్స్ ను ప్రొవైడ్ చేశారు. కానీ కొంత మంది వారి సొంత డబ్బుతోనే సీటింగ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసే క్రమంలో ఎంత సమయం వర్క్ చేస్తున్నామనే సంగతే వీరు మరిచిపోతారు. దీని ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం మూలాన బ్యాక్ పెయిన్ సమస్య అతి తక్కువ వయసులోనే వచ్చేస్తుంది. మరియు సమయానికి భోజనం చేయకపోవడం వలన అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ మరియు షుగర్ లు కూడా వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. పని మీద కలిగే ఒత్తిడి వీటికి మూలకారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు. కొన్ని విషయాలలో శ్రద్ద తీసుకోవడం వల్ల వీటి బారి నుండి బయటపడవచ్చు.
* ఎక్కువ సేపు కూర్చోకుండా అప్పుడప్పుడూ అలా వాకింగ్ చేస్తూ ఉండండి. రోజులో ఒక గంట పాటు ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉండండి.
* పని ఎప్పుడూ ఉండేదే, కాబట్టి రిలాక్స్ గా ఉండడానికి మీకు నచ్చిన కొన్ని పనులు చేయండి. ఉదాహరణకు: సినిమాలు చూడడం, బుక్స్ చదవడం మొదలైనవి.
* టార్గెట్ ఇచ్చినా మీకంటూ ఒక పని వేళను సెట్ చేసుకోండి. ఆ సమయం వరకు మాత్రమే పని చేయండి.
* ముందుగా కంపెనీ వారు ఆఫీస్ చైర్ ఆరెంజ్ చేసినా చేయకపోయినా, మీ డబ్బుతో మంచి ఆఫీస్ సెట్ అప్ ను కొనుక్కోండి.
ఇలా చిన్న చిన్న మార్పుల ద్వారా ఒత్తిడి నుండి బయటపడొచ్చు. తద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: