రాత్రి వేళలో పెరుగన్నం తింటే లాభమా.. నష్టమా..?

Divya
మనం ప్రతిరోజు తీసుకునే మంచి ఆహారపు అలవాట్ల వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే కొన్ని ఆహారాలను కొంతమంది తినక పోవడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పే ఆహారం ప్రతి ఒక్కరూ తినవచ్చు. అదేమిటంటే పెరుగన్నం. అవును పెరుగన్నం..దీనిని ఎలా, ఎప్పుడు తినాలో తెలుసుకుందాం.

పెరుగన్నం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇందులో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆహారాన్ని ఉదయంపూట, సాయంత్రం,మధ్యాహ్నం  ఇలా ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ రాత్రి పూట తీసుకోవడం వలన మనకు ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం.

1). పెరుగన్నాన్ని రాత్రిపూట తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా ద్వారా పేగుల సరఫరాను బాగా చేస్తుంది.

2). పెరుగులో ఉండే క్యాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. అంతే కాకుండా శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంది. అందుచేతనే పెరుగన్నాన్ని మూడు పూటలా తింటుంటారు.

3). పెరుగు అన్నం తిన్న వెంటనే నిద్రపోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పెరుగన్నానికి చల్లబరిచే గుణం ఉండటం వల్ల, భోజనం జీర్ణం అయ్యేటప్పుడు వేడి పుట్టడం జరుగుతుంది. దానిని పెరుగు చల్లబరచడం వల్ల నెమ్మదిగా అరగడం మొదలు పెడుతుంది. అందుచేతనే పడుకొనే 2 గంటల ముందు పెరుగన్నాన్ని తీసుకోవడం మంచిది.

4). జలుబు, దగ్గు ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.కానీ అందులోకి చక్కెర/మిరియాల పొడి/నిమ్మకాయ రసం. వంటివి కలుపుకోవడం మంచిది. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

5). పెరుగన్నం పిల్లలకు కూడా రాత్రి వేళలో పెట్టరు, దానికి కారణం జలుబు, దగ్గు చేస్తుందని. కానీ మధ్యాహ్నం వేళ , సాయంత్రం వేళ పెరుగన్నాన్ని పిల్లలకు పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుచేత అంటే దీనికి చల్లబరిచే గుణం ఉండడం వల్ల పిల్లలు హాయిగా నిద్ర పోతారు.

అయితే ఏది ఏమైనా పెరుగన్నం వల్ల లాభాలు ఉన్నాయే కానీ నష్టాలు లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: