ఒత్తిడిని తక్షణమే ఇలా తగ్గించుకోండి...

Purushottham Vinay
ఇక చాలా మంది తాము చేసే పనుల వల్ల కావొచ్చు లేక ఇతర విషయాలు వల్ల కావొచ్చు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతూ వుంటారు. అయితే ఒత్తిడి తగ్గించుకోవడానికి సుగంధ ద్రవ్యాలు ఎంతగానో సహాయపడతాయి.మంచి సువాసన కారణంగా మానసిక సమస్యలు దూరం చేసుకోవడానికి వీలవుతుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇక మనం తీసుకునే సువాసన బ్రెయిన్ వరకు కూడా చేరుతుంది. ఇక ఈ సువాసన మన ఎమోషన్స్, రెస్పాన్స్ మరియు జ్ఞాపకాలను కూడా ఇంపాక్ట్ చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.ఇక సిట్రస్ బేస్డ్ సుగంధ ద్రవ్యాలలో ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఇవి ఎక్కువగా ఇంట్లో క్లీనర్స్ కోసం వాడతారు.ఈ సువాసన ఒత్తిడి తగ్గడానికి ఎంత గానో ఉపయోగపడుతుంది. ఇక టీ,కాఫీ స్మెల్, బేక్ చేస్తున్న కేక్ లాంటి వాసనలు ఒత్తిడిని తగ్గిస్తాయి.

కాబట్టి రోజుకి రెండు సార్లు కాఫీ లేదా టీ తాగండి.ఒక మంచి సువాసన గల సెంట్ అనేది ఒక మనిషికి ఒక సందర్భాన్ని కానీ ఒక మూడ్‌ని కూడా పెంచేలా చేసి ఒత్తిడిని తగ్గించేందుకు సహాయం చేస్తుంది.ఇక బేబీ సువాసన నిజంగా ఆనందదాయకమైనది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక అదే విధంగా మనం ఎంతగానో ఇష్టపడే తండ్రి గారి దగ్గర వచ్చే సువాసన సెక్యూరిటీతో కూడుకున్నది. డైలీ నాన్నని కాని అమ్మని కాని హాగ్ చేసుకున్నప్పుడు ఒత్తిడి తగ్గిపోతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.అప్పుడే తయారు చేసిన బిస్కెట్స్ నుండి వచ్చే సువాసన కంఫర్ట్‌గా ఉండి ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే వర్షం పడ్డప్పుడు వచ్చే మట్టి వాసన కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.అరోమా థెరపీ కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.అంటే అది ఒక రకమైన స్ట్రెస్ హీలింగ్ ట్రీట్‌మెంట్ అని చెప్పొచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ మరియు నేచురల్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగించి ఈ అరోమాథెరపీ అన్నది చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: