గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.....

Purushottham Vinay
అమ్మ అవ్వడం ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అమ్మ అనిపించుకొని ఆడపిల్ల జీవితానికి అర్ధం ఉండదు. కాబట్టి గర్భం దాల్చడం ప్రతి ఆడపిల్ల కల. ఇక గర్భం దాల్చిన తరువాత మహిళలు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.ఇక సాధారణంగా చాలా మందికి వ్యాయామం చెయ్యడం లాంటి మంచి అలవాటు ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా వ్యాయామాలు చేస్తుంటారు. కాని చేసేముందు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.గర్భం దాల్చిన మహిళలు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే వ్యాయామాలు చేయడం చాలా ఉత్తమం. లేదంటే అదనపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గర్భిణీ మహిళలు స్విమ్మింగ్, చురుకైన నడక, సైక్లింగ్ వంటి తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం ఎంతో శ్రేయస్కారం. ముఖ్యంగా నాలుగో నెల దాటిన గర్భిణీలు నేలపై ఫ్లాట్‌గా పడుకోవడం మంచిది కాదు. కిక్ బాక్సింగ్, స్క్వాష్, టెన్నిస్, ఫుట్ బాల్, హాకీ వంటి ఆటలు ఆడటం వల్ల గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి క్రీడలకు దూరంగా ఉండాలి.


డైవింగ్ లాంటి జోలికి అస్సలు వెళ్లకూడదు.గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న గర్భిణీ మహిళలు కూడా అన్ని రకాల ఏరోబిక్ వ్యాయామాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల గుండె కొట్టుకునే రేటు (హృదయ స్పందన) పెరిగి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. అందువల్ల అధిక రక్తపోటు, ఉబ్బసం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న మహిళలు గర్భాధారణ సమయంలో కఠిన వ్యాయామాలు చేయడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.గర్భాశయ సమస్యలు (ప్లాసెంటా) ఉన్న మహిళలు కఠినమైన పనులు చేసినా లేదా వ్యాయామం చేసినా అది రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి వారు వ్యాయామం చేయకపోవడమే మంచిది. గర్భాశయ సంబంధ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తరువాత వారు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. అయితే వైద్యుడి సలహా మేరకే ఈ వ్యాయామాలను చేస్తే మంచిది.గర్భధారణ సమయంలో రక్తస్రావం జరిగినట్లు గమనిస్తే అలాంటి మహిళలు తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భస్రావం సమస్య తలెత్తకుండా ఉండటానికి గర్భం దాల్చిన మొదటి 12 వారాల పాటు వ్యాయామం చేయకుండా ఉండాలి.


ఒకవేళ వ్యాయామం చేయాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి సలహాలను పొందాలి.సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బరువు పెరుగుతారు. అందువల్ల గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కఠిన వ్యాయామం చేయడం వల్ల మంచి కంటే హాని ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కఠిన వ్యాయామాలు చేయాలంటే ఎలాంటి సమస్యలు రాకుండా వైద్యుల సలహాను కోరడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: