డీ హైడ్రేషన్ ను గుర్తించడం ఎలా..? రాకుండా ఉండటానికి ఏమి చేయాలి..?

kalpana
 ఎండాకాలం ప్రారంభమైంది కాబట్టి ఎక్కువగా మండుతున్నాయి. ఎండా వేడి ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి డీహైడ్రేషన్ వస్తూ ఉంటుంది. అలా  జరక్కుండా ఉండాలంటే, రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. దాహం అనిపించినప్పుడు అల్లా నీరు తాగుతూ ఉండాలి. అలాగే వేసవిలో  దొరికే పండ్లు తీసుకోవడం వల్ల కొంతవరకు డీ హైడ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా  ఇప్పుడు దొరికే పుచ్చకాయ, కర్బూజ, వాటిని తినడం వల్ల దాహాన్ని తీర్చుకోవచ్చు. డీ హైడ్రేషన్ ను ఈ విధంగా గుర్తించవచ్చు..                 
 నోరంతా పొడిబారినట్లు, నాలుక తడారిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డీ హైడ్రేషన్ ఉన్నట్లు గుర్తించాలి.
 తీవ్రమైన అలసట, నిద్ర  కోవాలనే కోరిక ఇవి కూడా డీహైడ్రేషన్ లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు నీళ్ళు కొంచెం ఎక్కువగా తాగాలి. ఈ సమయంలో నిద్ర కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటిని  గుర్తించి తగిన  చికిత్స పొందాలి.
 తలనొప్పి తో కూడా ఎక్కువ బాధ పడుతున్నప్పుడు డీహైడ్రేషన్ కి గురి  అయినట్లు గుర్తించాలి.
 కండర తిమ్మిర్లు, శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిల సమతుల్యతకు కారణం అనుకుంటారు. కానీ  డీహైడ్రేషన్ కు ఒక గుర్తు.
 చాలామంది శారీరిక శ్రమ చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో చెమట ఎక్కువగా ఉంటుంది. అలా  కాకుండా చెమట నిలిచిపోతే డీహైడ్రేషన్ కు గురయినట్లు గుర్తించి హైడ్రేషన్ రావడానికి నీళ్లు  ఎక్కువగా తాగాలి.
 డీహైడ్రేషన్  కు గురైనప్పుడు మూత్రం ముదురు పసుపు రంగులో వస్తుంది. అంతేకాకుండా మంటగా కూడా ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే నీళ్లు తాగాలి.
 చర్మము సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు గుర్తించి. నీళ్లు బాగా తాగాలి.
 కంటి చూపు సరిగా  కనపడకపోయినా డీహైడ్రేషన్ ఉన్నట్లు గుర్తించాలి. ఒక్కోసారి రక్తంలో చక్కర స్థాయిలు ఉన్నప్పుడు కూడా కంటి చూపు మందగిస్తుంది. అందుకు సమయానికి భోజనం చేయలేక పోయినప్పుడు వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: