శరీర బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే త్రిఫల చూర్ణం వాడాల్సిందే..!

kalpana
ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు సమస్య.అధిక బరువు కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఎంతో మంది వారి శరీర బరువును తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా శరీర బరువును తగ్గించుకోవడం కోసం ఎంతోమంది శరీర వ్యాయామాలు, ఆహార నియమాలను పాటించడం, జిమ్ కి వెళ్ళడం వంటివి చేస్తుంటారు.అయితే ఇవన్నీ పాటించినప్పటికీ కొందరిలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారి కోసమే త్రిఫల చూర్ణం. బరువు తగ్గాలనుకొనే వారికి త్రిఫల చూర్ణం మంచి ఆయుర్వేదం గా పనిచేస్తుంది. అయితే త్రిఫల చూర్ణం ఏ విధంగా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం...
త్రిఫలాలకు పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వ కాలం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ త్రిఫల చూర్ణాన్ని వాడుతున్నారు. ఈ త్రిఫల చూర్ణంలో మూడు రకాల మూలికలు ఉంటాయి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ మూడు మూలికలను బాగా ఎండబెట్టి పొడి చేయడం ద్వారా త్రిఫల చూర్ణం తయారు చేసుకోవచ్చు. అయితే ఈ మూడు మూలికలను సమాన భాగాలలో కలుపుకోవాలి. ఈ చూర్ణం పొడి రూపంలో, గుళికల రూపంలోనైనా వాడుకోవచ్చు.
అధిక శరీర బరువుతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ టీస్పూన్ల త్రిఫల చూర్ణం, ఒక దాల్చిన చెక్కను వేసి రాత్రంతా ఆ మిశ్రమాన్ని నీటిలో అలాగే నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా త్రాగటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలిగిపోవడమే కాకుండా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి శరీర బరువును తగ్గించుకోవచ్చు.
అదే విధంగా ఈ త్రిఫల చూర్ణం గుళికలను రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకొని ఈ గులిక మింగటం వల్ల శరీర బరువును తగ్గవచ్చు. ఒక గ్లాసు  నీటిని మరగబెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణం, కొద్దిగా నిమ్మరసం కలిపి నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని రాత్రి పడుకునే ముందు త్రాగటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించడం వల్ల మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు. అయితే కొందరిలో ఈ త్రిఫల చూర్ణం వాడటం వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలుఎదురవుతాయి అలాంటివారు వీటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: